top of page

🌿🍲 మీ ఆహారంలో ఖచ్చితంగా చేర్చుకోవాల్సిన వంటగది మసాలాలు ఇవే! 🍲🌿

🔸పసుపు: పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్న విషయం విదితమే. బ్యాక్టీరియా దరి చేరకుండా చూడటంలో పసుపు ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగితే చాలా మంచిది. 🍵

🔸 దాల్చిన చెక్క: దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లబిస్తాయి. అంతే కాకుండా రక్త పోటు, డయాబెటీస్ రాకుండా చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే జీర్ణ క్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. 🌰

🔸 అల్లం: అల్ల అనేది నిత్యవసర వస్తువుగా మారిపోయింది. చాలా మంది ప్రతి రోజూ అల్లం టీని తాగుతూ ఉంటారు. అలాగే పలు రకాల వంటల్లో కూడా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో కూడా అల్లాన్ని.. పలు రకాల వ్యాధులను నయం చేయడంలో ఉపయోగిస్తారు. అల్లాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. 🥣

🔸 వెల్లుల్లి: వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ గా ఉపయోగ పడుతుంది. శరీరంలోకి సూక్ష్మ జీవులు ప్రవేశించకుండా చూస్తుంది. అంటు వ్యాధులతో పోరాడుతుంది. 🌶️

🔸 తులసి ఆకులు: తులసి ఆకుల్లో కూడా అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది శ్వాస కోశ ఇన్ ఫెక్షన్లు, జ్వరం మొదలైన వాటిని ఎదుర్కొనడంలో సహాయ పడుతుంది. అదే విధంగా తులసి ఆకులు తీసుకుంటే శరీరంలో రోగి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. 🌿🍵

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page