top of page
Shiva YT

స్ముతీలలో ఈ మసాలా దినులు కలిపితే రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతం 😋

స్మూతీస్‌లో దాల్చిన చెక్క పొడిని కలపవచ్చు. ఇది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించి, చలికాలంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాల్చినచెక్క శరీర మంటను తగ్గించడానికి, అదనపు కేలరీలను ఖర్చు చేయడానికి కూడా సహాయపడుతుంది. 😌🩹

స్మూతీస్‌లో అల్లం కూడా జోడించవచ్చు. చలికాలంలో అల్లం తింటే శరీరం వెచ్చగా ఉంటుంది. అలాగే, అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది. 🌶️🤲

రుచి కోసం స్మూతీలో తేనెను జోడించవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా, తేనెలోని యాంటీఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. స్మూతీలో చిటికెడు జాజికాయ పొడిని కలుపుకోవచ్చు. ఈ మసాలాలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇందులో మాంగనీస్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. అందువల్లనే ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 🍯🍊

స్మూతీస్‌లో గుమ్మడి గింజలను కలపవచ్చు. ఈ గింజల్లో విటమిన్లు, ఫైబర్ ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. 🥥🌰

bottom of page