top of page

🍍🍍🍍మూడీగా ఉన్నారా..వీటిని తింటే చిరాకంతా ఎగిరి పోతుంది! 🍍🍍🍍

🍍పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మానసిక స్థితిని మార్చడానికి హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా శరీరంలో ఇన్ ఫ్లమేషన్ ను కూడా తగ్గిస్తుంది. సెరోటోనిన్ స్థాయిలను మెరుగు పరిచేందుకు సహాయ పడుతుంది. మీ మూడ్ బాలేనప్పుడు పైనాపిల్ తింటే సరిపోతుంది. 🍍

🌽నిమ్మకాయ: నిమ్మ కాయతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. దీర్ఘ కాలిక వ్యాధులకు సైతం అదుపు చేయవచ్చు. అలాగే మూడ్ ని మార్చడంలో కూడా నిమ్మ కాయ హెల్ప్ చేస్తుంది. నిమ్మ పండులో వాటెర్ కంటెంట్, విటమిన్లు అనేవి మెండుగా ఉంటాయి. మూడ్ బాలేనప్పుడు నిమ్మ రసం తీసుకున్నా కూడా సరి పోతుంది. మనిషిని యాక్టీవ్ చేస్తుంది. 🌽

🍓అరటి పండు: అరటి పండులో ఎనర్జీ లెవల్స్ అనేవి మెండుగా ఉంటాయి. ఇది అన్ని కాలాల్లో విరివిగా దొరుకుతుంది. అంతే కాకుండా తక్కువ ధరలో లభ్యమవుతుంది. మీకు మూడ్ బాలేనప్పుడు.. అరటి పండును తింటే.. ఉపశమనం లభిస్తుంది. శరీరంలో హ్యాపీగా ఉంచే సెరోటోనిన్ అనే హార్మోన్లను విడుదల చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. 🍓

🍇బెర్రీలు: అన్ని రకాల బెర్రీస్ లో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అనేవి మెండుగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి.. మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది. బెర్రీల్లో ఉండే విటమిన్ సి.. హ్యాపీ హార్మోన్ అయిన డోపమైన్ ను విడుదల చేస్తుంది. 🍇

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page