top of page
Shiva YT

🍊 షుగర్‌ పేషెంట్లు జామకాయలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

🌱 శీతాకాలంలో జామపండ్లు అన్ని ప్రాంతాల్లో లభిస్తాయి. జామపండు ఎంత రుచికరమైనదో, ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది.

🍇 శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడం, బరువును నియంత్రించడంలో జామ అద్భుతంగా పనిచేస్తుంది.

🍊 జామపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జామపండులో గ్లైసెమిక్ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచని ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.

👨‍⚕️ మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామ చాలా మేలు చేస్తుంది.

💪 అధిక బరువుతో బాధపడేవారు బరువును నియంత్రించాలనుకుంటే, జామపండ్లను తినొచ్చు. ఇందులో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది జీవక్రియను బలపరుస్తుంది.

🧘 జామపండులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది. అందుకే ఒత్తిడికి లోనైనప్పుడు జామపండ్లను తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.

👍 ముఖ్యంగా చలికాలంలో జామ తప్పనిసరిగా తినాలి. జామపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచంలో సహాయపడుతుంది. జామ చర్మానికి కూబి చాలా మేలు చేస్తుంది.

bottom of page