top of page
Shiva YT

🍏🍎 మీ కిడ్నీ ఆరోగ్యానికి ఈ పండు దివ్యౌషధం..

🍏 ఆపిల్ పండుతో కిడ్నీలు సేఫ్ అంటున్నారు వైద్యులు. యాంటీ యాక్సిడెంట్లు ఆపిల్‌లో ఎక్కువగా ఉంటాయి. గుండె వ్యాధులు, కొలెస్ట్రాల్ తగ్గడంతో షుగర్ కంట్రోల్ అవుతుంది.

షుగర్ పెరిగితే కిడ్నీలకు ముప్పు.. కాబట్టి ఆపిల్ పండుతో ఇవన్నీ కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. అయితే ఆపిల్‌తో పాటు వెల్లుల్లి కూడా కిడ్నీలకు బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి తినడం వల్ల కిడ్నిల నుంచి అనవసరం అయిన వ్యర్దాలు బయటకు వెళ్తాయి. అయితే వెల్లుల్లిని పచ్చిగా ప్రతి రోజు తీసుకోవచ్చు.. లేదంటే కూరల్లో వేసుకొని తిన్నా మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు వైద్య నిపుణులు. 🍏 ఆపిల్, వెల్లుల్లి మాత్రమే కాదు ఓట్స్ కూడా కిడ్నీలకు బాగా ఉపయోగపడుతాయి. ఓట్స్‌లో పీచు పదార్దాలు ఎక్కువ ఉంటాయి. దీనివల్ల కిడ్నిలో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. ఓట్స్‌లో బీటా గ్లూకాన్ అనే నీటిలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఉదయం పూట ఓట్స్ తీసుకుంటే చాలా మంచిది. ఇక అన్నింటికన్నా కిడ్నీల రక్షణకు వరప్రదాయని నీరు.. నీళ్లు ప్రతి రోజు ఎంత తాగితే బాడీకి అంత మంచిది. క్రమం తప్పకుండా రోజు నాలుగు నుంచి అయిదు లీటర్ల నీళ్లు తీసుకువడం వల్ల శరీరాన్ని డీ హైడ్రేషన్‌ను గురికాకుండా కాపాడుతుంది. నీటిని ఎక్కువ తాగడం వల్ల కిడ్నిలు క్లిన్ అవుతాయి. విష పదార్దాలు బయటకు పోతాయి. 🌶️ మిర్చిలో ఒక రకమైన లావుగా ఉండే ఎర్రటి మిర్చిలో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటాయి. ఇవి మార్కెట్‌లో అరుదుగా లభిస్తాయి. సో ఇవన్ని మానవ శరీరంలోని విష పదార్దాలను బయటకు పంపి.. కిడ్నీలను ఆరోగ్యాంగా ఉంచుతాయి. కాబట్టి ఇలాంటి పదార్డలు విరివిగా తీసుకోవడం మంచిది అంటున్నారు వైద్యులు.🚨 గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

bottom of page