🩺 సాధారణంగా ఐదు నుంచి ఏడు రోజుల పాటు కొనసాగే ఒక అంటు వ్యాధి. పిల్లలతోపాటు వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, రోగనిరోధక శక్తి లేనివారికి సోకితే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉంటుంది. స్టెరాయిడ్స్ వంటి దీర్ఘకాలిక ఔషధాలను తీసుకునే వారికి ప్రమాద తీవ్రత అధికంగా ఉంటుంది.
లక్షణాలు:
జ్వరం, చలి, అస్వస్థత, ఆకలి లేకపోవడం, మైయాల్జియా, వికారం, తుమ్ములు, మూడు వారాల వరకు పొడి దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
తీసుకోవల్సిన జాగ్రత్తలు:
ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు చేయవలసినవి చేయకూడని కొన్ని ముఖ్య సూచనలు ఇవే..
దగ్గినప్పుడు లేదా తుమ్మేటప్పుడు నోరు, ముక్కును కప్పుకోవడం
తరచుగా చేతులు కడుక్కోవడం
అనవసరంగా చేతులతో ముఖాన్ని తాకకుండా ఉండటం
రద్దీగా ఉండే ప్రదేశాలలో ఫేస్ మాస్క్‌లను ధరించడం
ఉత్తర చైనాలోని పిల్లలలో శ్వాసకోశ అనారోగ్యం పెరుగుతున్నట్లు అక్కడి మీడియా సంస్థలు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కథనాల దృష్ట్యా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శ్వాసకోశ వ్యాధుల నివారణకు సంసిద్ధత చర్యలను సమీక్షించాలని నిర్ణయించింది. శీతాకాలంలో ఇన్‌ఫ్లుఎంజా కారణంగా శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలకు కారణమవుతుంది.
🔍 ఉత్తరాఖండ్‌లోనూ హెచ్చరికలు జారీ..
🚨 ప్రజారోగ్యంపై నిఘా పెంచాలని అధికారులను ఆదేశిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాఖండ్‌లో చైనా సరిహద్దు కలిగిన మూడు జిల్లాలు.. చమోలి, ఉత్తరకాశీ, పితోరాఘర్‌లలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. 🚧👁🗨