ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే 7 గంటల నిద్ర చాలా అవసరం. ఈ 7 గంటలు శరీరం తనను తాను రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
కణాలు మరమ్మత్తు చేయబడతాయి. కండరాలు పునర్నిర్మించబడతాయి. మంచి నిద్ర రిఫ్రెష్, పునరుజ్జీవన అనుభూతిని కలిగిస్తుంది. అంతేకాకుండా తగినంత నిద్ర పోవడం వల్ల అభిజ్ఞా పనితీరు, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది. ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే ముందుగా చేయవలసిన పని.. బాగా నిద్ర పోవడం. సరైన నిద్ర లేకుంటే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థ కూడా కుంటుపడుతుంది. నిజానికి తగినంత విశ్రాంతి లేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. 7 గంటల కంటే తక్కువ నిద్ర పోవడం వల్ల శరీరంలో పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. తొలుత రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది. ఆ తర్వాత జలుబు, జ్వరం, ఇతర ఇన్ఫెక్షన్లు త్వరగా సోకుతాయి. 😷
రాత్రి పూట కనీసం 7 గంటలు నిద్ర పోకపోతే మరుసటి రోజు ఉదయం అలసటగా అనిపిస్తుంది. రోజంతా పని చేసే శక్తి ఉండదు నీరసంగా ఉంటుంది. రోజంతా ఆవులిస్తూ నిద్రమత్తుగా ఉంటుంది. కనురెప్పలు వాలిపోతూ ఉంటాయి. ఇది మీరు చేసే పనికి కూడా ఆటంకం కలిగిస్తుంది. అలాగే ఆలోచించే లేదా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. నిద్ర లేకపోవడం మానసిక ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. మూడ్ స్వింగ్స్‌తో పాటు ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. నిద్ర సమస్యలతో బాధపడేవారు, మానసిక అనారోగ్యం త్వరగా కుంటు పడుతుంది. 🚫💤