top of page
Shiva YT

చేదు కారణంగా కాకర కాయలను దూరంపెడుతున్నారా...🌊

కాకర కాయలో నుంచి చేదు తీయాలంటే.. కట్ చేసిన కాకర కాయ ముక్కలను ఉప్పు నీటిలో వేయాలి. వీటిని సుమారు 15 – 20 నిమిషాల పాటు ఉప్పు వాటర్ లో ఉంచితే.. చేదు అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి. 🌊

తేనె లేదా చక్కెర వాటర్:

కాకర కాయలో నుంచి చేదును తొలగించు కోవడానికి ఈ టిప్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. తేనె లేదా చక్కెర కలిపిన నీటిలో వాటిని వేయాలి. ఇలా ఓ అరగంట సేపు షుగర్ కలిపిన నీటిలో ఉంచడం వల్ల చేదు తగ్గుతుంది. 🍯🍹

పెరుగులో నానబెట్టండి:

పెరుగు కూడా కాకరలో ఉండే చేదును తగ్గిస్తుంది. కట్ చేసిన కాకర కాయ ముక్కలను పెరుగు లేదా మజ్జిగలో.. 15 నుంచి 20 నిమిషాలు ఉంచండి, ఇలా చేస్తే చేదు తొలగే అవకాశాలు ఉన్నాయి. అలాగే పెరుగులో కాకర కాయ ముక్కలను వేసి ఓ పది నిమిషాలు ఉడికించినా చేదు తొలగుతుంది. 🥛🕰️

కాకరతో ముఖ్యమైన ప్రయోజనాలు:

కాకర కాయను తినడం వల్ల రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తంలో, శరీరంలో ఉండే మలినాలను తొలగిస్తుంది.

కాకరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది.

కాకర కాయను క్రమం తప్పకుండా తీసుకుంటే.. రక్తంలో షుగర్ లెవల్స్ ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

కాకరో ఉండే పొటాషియం వల్ల రక్త పోటు అనేది కంట్రోల్ అవుతుంది. అంతే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే కాకర కాయను తినడం వల్ల చర్మ సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. 🍽️👩‍⚕️

bottom of page