top of page
Shiva YT

ఉదయం పూట మర్చిపోయికూడా వీటిని తినకండి.. బ్రేక్‌ ఫాస్ట్‌ ఎలా ఉండాలంటే? 🌅🍽️

ప్రతి ఉదయం నిద్రలేచిన తర్వాత తమ రోజును అనేక మంది టీతో ప్రారంభిస్తారు. తద్వారా వారు తాజా అనుభూతి చెందుతారు. మంచి అల్పాహారం శక్తిని ఇస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. అందుకే మంచి అల్పాహారం ఎంపికలు ఆరోగ్యానికి ఎల్లప్పుడూ అవసరం అంటుంటారు ఆరోగ్య నిపుణులు. 🥗💪


అల్పాహారం రాజులా తినాలని కూడా అంటారు. మనం తినేది చాలా ముఖ్యం కాబట్టి రోజును మంచి ఆహారంతో ప్రారంభించాలి. అయితే ఉదయం పూట తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో ఇలాంటి ఆహారాలు మర్చిపోయి కూడా తీసుకోకూడదంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.. 🍳🥞

మీరు ఉదయం అల్పాహారంగా పాన్‌కేక్‌లు తింటుంటే ఈరోజే ఆ అలవాటును మానేయండి. పొరపాటున కూడా అల్పాహారంలో పాన్‌కేక్‌లు, వేఫర్‌లు తినకూడదు. పాన్‌కేక్‌లు, బేకరీ ఉత్పత్తులను తినడం వల్ల శరీరంలోని శక్తి తగ్గిపోతుంది. అందుకే అల్పాహారానికి ఇది అస్సలు మంచి ఎంపిక కాదు. 🍰🍩

చాలా మంది టీతో తమ రోజును ప్రారంభిస్తారు. ఖాళీ కడుపుతో టీ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఉదయం పూట ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా ఆరోగ్యానికి హాని కలుగుతుంది. పండ్లు లేదా ఏదైనా అల్పాహారం తీసుకున్న తర్వాత మాత్రమే టీ తీసుకోవాలి. 🍵🚫

ఈ రోజుల్లో మార్కెట్‌లో వివిధ రకాల తృణధాన్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్యాక్‌డ్‌ ఫుడ్‌ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఇవి వివిధ రుచులలో కూడా ఉంటాయి. అయితే తినడానికి రుచిగా ఉన్నప్పటికీ, ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. 🌾🥦

bottom of page