🥝 కివి పండు.. కాస్త ఖరీదైనదే.. కానీ, దీని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం పుష్కలం.. 🍈 ముఖ్యంగా కివి పండును డెంగ్యూ బాధితుల్లో ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడానికి తప్పక తీసుకోవాలని డాక్టర్లు చెబుతుంటారు.
కానీ, కివి పండు తొక్క.. గరుకుగా, దృఢంగా ఉంటుంది. అందుకే ఎవరూ తినేందుకు ఇష్టపడరు.. కానీ, కివి పండు తొక్కలో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, విటమిన్ C పొందవచ్చు. నిజానికి, దాని పైతొక్క.. గుజ్జు కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. 🌱
🐉 డ్రాగన్ ఫ్రూట్: ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన డ్రాగన్ ఫ్రూట్‌ను మనం తొక్కను తీసేసే తింటాం... కానీ, డ్రాగన్ ఫ్రూట్ తొక్క కూడా చాలా ఆరోగ్యకరమైనదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ తొక్కలో ఎక్కువ మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, బీటాసైనిన్ లు ఉన్నాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడుతాయి. డ్రాగన్ ఫ్రూట్ తొక్కలో ఉండే డైటరీ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తుంది. 🐲
🍏 ఆపిల్ పండు: తింటే..ఆపిల్ పీల్స్‌లో అధిక మొత్తంలో ఉర్సోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొవ్వును తొలగిస్తుంది. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి మంచిది. ఆపిల్ పీల్స్‌లో ఉండే క్వెర్సెటిన్ అనే మూలకం శ్వాస సమస్యలను తొలగిపోతాయి. మొత్తం ఆపిల్‌లో 8.5 మిల్లీగ్రాముల విటమిన్ సి, 98 యూనిట్ల విటమిన్ ఎ ఉంటుంది. పై తొక్కను తొలగించడం వల్ల 8.5 మిల్లీగ్రాముల నుంచి 6.5 వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 🍏