🍛 మసాలా దినుసులు: భారతీయ వంట గదిలో ఉండే పసుపు, జీలకర్ర, మెంతులు, అవాలు, ఎలకులు, వాము, కొత్తిమీర, ఎండు మిర్చి వంటి ఇతర సుగంధ ద్రవ్యాలు రుచిని పెంచడంలోనే కాక ఆరోగ్యాన్ని కూడా కాపాడడంలో కూడా ఉపకరిస్తాయి. 🌿
వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ వంటి పలు లక్షణాలు పుష్కలంగా ఉండడమే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు.
🌶️ పచ్చి మిర్చి: పచ్చి మిరపకాయల్లో విటమిన్ సి, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. 🌶️🔥
🍏 ఉసిరి: విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ల కోసం ఉసిరి ఒక సూపర్ ఫుడ్. ఉసిరిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి బలోపేతం కావడమే కాక చర్మ, కేశ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 🍏💪
🍊 సిట్రస్ పండ్లు: నారింజ, విటమిన్ వంటి సిట్రస్ పండ్లు విటమిన్ సికి మంచి వనరులని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంటీ ఆక్సిడెంట్లకు కూడా నిలయమైన ఈ పండ్లు రోగ నిరోధక శక్తని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. 🍊🍊
🥜 విత్తనాలు, గింజలు: బాదం, జీడి పప్పు, పిస్తా, వాల్నట్స్, పుచ్చకాయ గింజలు, గుమ్మడి కాయ విత్తనాలు వంటి పలు రకాల గింజలు, విత్తనాలు కూడా ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. 🌰🥜