top of page
Shiva YT

ఈ ఆహారాలు పదే పదే తింటున్నారా.. 🍲🍽️

ఎముకలు స్ట్రాంగ్ గా ఉండాలంటే ప్రోటీన్ అనేది చాలా ముఖ్యంగా. కానీ ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే మాత్రం.. ఎముకలకు హాని జరుగుతుంది. ఎందుకంటే బాడీలో క్యాల్షియం లోపం ఏర్పడుతుంది. దీంతో ఎముకలు బలహీనంగా తయావుతాయి. కాబట్టి మీ ఆహారంలో ప్రోటీన్స్, క్యాల్షియం రెండూ సమపాలల్లో తీసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. 🥦🍚

ఉప్పు:

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాల్షియం లోపం తలెత్తే అవకాశం ఉంది. ఉప్పులో ఉండే సోడియం.. క్యాల్షియాన్ని క్షీణించేలా చేస్తుంది. దీంతో ఎముకలు గుల్ల బారి పోయి.. బలహీనంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో ఉప్పు ఎక్కువగా లేకుండా చూసుకోండి. 🧂🍲

కొన్ని రకాల కూరగాయాయాలు:

బచ్చలి కూర ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఇందులో ఆక్సలేట్ అనేది అధికంగా ఉంటుంది. వీటిలోనే కాకుండా బీన్స్, కొన్ని రకాల చిక్కుళ్ళు, దుంపల్లో కూడా ఆక్సలేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తక్కువ మోతాదులో తీసుకుంటేనే ఎముకలకు చాలా మంచిది. అలాగే టమాటా, వంకాయ, బంగాళ దుంపలు, పుట్ట గొడుగులు, మిరియాలు వంటివి ఎక్కువగా తీసుకుంటే బోలు ఎముకల వ్యాధికి దారి తీస్తుంది. 🥦🍆

కెఫిన్:

సాధారణంగా ఇది కొంతమేర ఆరోగ్యం అయినప్పటికీ.. కెఫిన్ ఎక్కువగా ఉండే డ్రింక్స్, కాఫీ, టీలు ఎక్కువగా తీసుకుంటే మాత్రం క్యాల్షియం శోషణకు ఆటంకం కలుగుతుంది. దీంతో ఎముకలు బలహీనంగా మారతాయి. ☕🥛

bottom of page