top of page
Shiva YT

🍲 రోజుకు మూడు సార్లు అన్నం తింటున్నారా..

🚶 శరీరానికి తగినంత ఫైబర్ అందకపోతే మలబద్ధకం ఏర్పడుతుంది. పప్పులు, కూరగాయలు, గోధుమలు, శనగలు, మినుములు వంటి వాటిని భోజనంలో చేర్చుకోవాలి. 🌾

ఇవన్నీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. 🍽️ వైట్ రైస్ లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి తెల్లటి అన్నం తక్కువగా తినమని సూచిస్తున్నారు.

⚖️ వైట్ రైస్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అధిక కేలరీల తీసుకోవడం వల్ల నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. 💪 బరువు పెరగడం, రక్తంలో చక్కెర పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక 🚫 వైద్యుల సలహా మేరకు అన్నం తీసుకోవడం మంచిది.

⚠️ ఇతర ధాన్యాలతో పోలిస్తే వైట్ రైస్‌లో పోషకాలు తక్కువగా ఉంటాయి. ఈ పోషకాల లోపం ఎముకలు, దంతాలతో సహా అనేక ఇతర సమస్యలకు దారి తీస్తుంది. పోషకాహార లోపం అనేక ఇతర సమస్యలను కలిగిస్తుంది. 👨‍⚕️ రోజూ ఎక్కువగా అన్నం తింటే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.

🍚 తెల్ల బియ్యం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అందుకే మధుమేహం ఉన్నవారు వైట్ రైస్ తినకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 🚫 బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. వైట్ రైస్ తినడం వల్ల మధుమేహం వస్తుంది. 🩺 మధుమేహ వ్యాధిగ్రస్తులు వీలైనంత వరకు అన్నం తినకుండా.. ఇతర ఆహార ధాన్యాలను తినే ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. 🍏

bottom of page