ఈ వ్యాధి చాలా అరుదు అని కూడా వైద్యులు వెల్లడించారు. 💊👩⚕️ యువకుడి అసాధారణ నిద్రను గమనించిన కుటుంబ సభ్యులు ముందుగా స్థానిక వైద్యులు, మంత్రగత్తెలను సంప్రదించారు. 💉👨⚕️
అయినప్పటికీ ఫలితం లేకపోయింది. అతడు అదే నిద్రను కొనసాగిస్తూ వస్తుండటంతో కుటుంబీకులు అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. 👨⚕️🏥 అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు అన్ని రకాల టెస్టులు నిర్వహించారు. 💉🔬 తన కెరీర్‌లో ఇది మూడో కేసు అని, పదేళ్ల క్రితం రెండు కేసులున్నాయని డాక్టర్ చెప్పారు. 📅👨⚕️ ఈ వ్యాధికి స్పష్టమైన కారణం లేదు. కారణం వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చునని అంటున్నారు. 💻🔍 అతను మేల్కోవాలని మనస్సులో అనుకుని నిద్రకు ఉపక్రమించినప్పటికీ అతని శరీరం నిద్రలేచేందుకు సహకరించదు. 😴❌ అలా వారు రోజులతరబడి నిద్రావస్థలోనే ఉండిపోతారని చెప్పారు.
KLSని నిర్ధారించడానికి నిర్దిష్ట పరీక్షలు లేవు. 💉👨⚕️ న్యూరాలజిస్ట్ డాక్టర్ రాహుల్ చకోర్ మాట్లాడుతూ 12 నుంచి 25 ఏళ్లలోపు టీనేజర్లు, యువకుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుందని తెలిపారు. 🗣️👨⚕️ వైద్యులు ఈ వ్యాధిని ‘కుంభకర్ణ సిండ్రోమ్’ అని కూడా పిలుస్తారు. 💬👨⚕️ అయితే, ప్రపంచంలో అత్యంత కొద్ది మందిలో మాత్రమే ఈ అరుదైన వ్యాధి కనిపిస్తుంది. 🌍😴 ఇలాంటి వారికి సరైన చికిత్స అవసరం..చికిత్స సత్ఫలితాలు ఇస్తాయా లేదా అన్నది వైద్యులు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. 👍👨⚕️
ఇకపోతే, గతంలోనూ రాజస్ధాన్ లోని నాగౌర్ జిల్లా భద్వా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇలాంటి వింత వ్యాధితో బాధపడుతున్నట్టుగా తెలిసింది. 👨⚕️😴 అతడు కూడా ఇలానే రోజుల తరబడి నిద్రపోతుంటాడు. 😴🌍 అతడిని మేల్కొల్పేందుకు కుటుంబంసభ్యులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. 📢👨⚕️ ప్రస్తుతం మహారాష్ట్రలో మరో కేసు వెలుగులోకి వచ్చింది. 🌐💉 సరైన చికిత్స, వ్యాధి కారణాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. 🔬👨⚕️