top of page

🌿 చలికాలంలో గుండె సమస్యలు నివారించాలంటే ఈ పండ్లు తప్పక తినాలి

🌿 చలికాలంలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కొన్ని పండ్లను తప్పనిసరిగా తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. 🍏

అవేంటంటే..నిమ్మకాయ.. చలికాలంలో రోజూ ఏదైనా సిట్రస్‌ పండు తినాలి. ఈ సమయంలో మార్కెట్లో చాలా నారింజ, ముసాంబి అందుబాటులో ఉంటాయి. 🍋 విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఏదైనా పండు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. 💪 గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రతిరోజూ ఈ పండ్లలో ఏదో ఒకటి తినాలి. 💚

🍎 యాపిల్స్.. చలికాలంలో యాపిల్స్ అధికంగా లభిస్తాయి. క్రమం తప్పకుండా ఆపిల్ తినడం వల్ల స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. ఎందుకంటే యాపిల్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఆపిల్ పీల్స్‌లో ఫ్లేవనాయిడ్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలను నివారిస్తుంది. 🍏🍎

🌿 పుచ్చకాయ.. పుచ్చకాయ ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. పుచ్చకాయ ధమనులను శుభ్రపరుస్తుంది. ఈ పండులో ఫైబర్, విటమిన్లు, లైకోపీన్ వంటి మినరల్స్‌ చాలా ఉన్నాయి. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలను నివారిస్తుంది. 🥒✨

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page