top of page
Shiva YT

🥦 కాకరకాయ.. మితంగా తింటే ఔషధం.. అమితంగా తింటే విషం..ఎందుకంటే..

🍲 కాకరకాయ.. దీని పేరు వినగానే గుర్తొచ్చేది చేదు...ఎంత చేదు కూరగాయ అయినా కాకరకాయ కు మంచి డిమాండ్ ఉంది..షుగర్ వ్యాధి గ్రస్తులు కాకరకాయను ఎక్కువగా తింటుంటారు.

షుగర్ అనేది ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద వ్యాధి గా మారింది. వయసుతో పని లేకుండా చిన్నా, పెద్ద, ముసలి ,మూతిక అందరిని అటాక్ చేస్తుంది.

షుగర్ తో బాధపడ్తున్నవారు దాన్ని కంట్రోల్ లో పెట్టుకోడానికి చేదు పదార్దాలు ఎక్కువగా తింటుంటారు. మెంతులు,మెంతి కూరతో పాటు కాకరకాయను కూడా ఎక్కువగా వినియోగిస్తారు.. కాకరకాయను కూర రూపంలోనే కాకుండా కాకరకాయను రసం చేసుకొని తాగితే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది అంటారు.

కాకరకాయ డయాబెటిస్ కంట్రోల్ కు మంచి పదార్థమే అయినా ఇంతకు దాన్ని ఎంత మేరకు తినాలి.? ఎలా తిండాలి.? అన్నది కూడా చాల ముఖ్యం అంటున్నారు వైద్యులు...తిండాలే మేలు ఏంటి.? అతిగా తిండాలే నష్టం ఏంటి.? కాకరకాయ చేదుగా ఉంటుంది కానీ ఇందులో పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి. షుగర్ నే కాదు కాకరకాయ బరువును కూడా కంట్రోల్ తగ్గిస్తుంది.

బాడీలో కొవ్వును తగ్గించడంలో కాకరకాయ బాగా పనిచేస్తుంది. గుండెకు కూడా కాకరకాయ మేలు చేస్తుంది. కొవ్వును కరిగించడంలో కాకర బాగా పనిచేస్తుంది. షుగర్ లెవల్స్ ని కాకర కంట్రోల్ చేస్తుంది. అయితే షుగర్ లెవల్స్ తక్కువ ఉన్నవాళ్ళు మాత్రం కాకరకాయను తినకూడదు. గర్భధారణ సమయంలో పిండానికి మంచిది కాదు అని వైద్యుల మాట. కాబట్టి ఆ సమయంలో కాకరకాయ తినకపోవడం మంచిది.

షుగర్ ను దృష్టిలో పెట్టుకొని ప్రతి రోజు కాకరకాయ తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదంటా.. అలా తిండాలే మేలు ఏంటి.? షుగర్ కంట్రోల్ చేస్తే నష్టం ఏంటి.? తిండాలే ఆరోగ్యానికి మంచిది.

bottom of page