top of page
Shiva YT

🦟 బెంగళూరులో వెలుగులోకి వచ్చిన జికా వైరస్..

🔍 బెంగళూరుకు సమీపంలోని చిక్కబళ్ళాపూర్ ప్రాంతంలో జికా వైరస్ కనుగొనబడింది. ఇది దోమల ద్వారా వ్యాపిస్తుందని చెబుతున్నారు వైద్యులు. 🏥🦠 గత కొంత కాలంగా ఈ ప్రాంతంలోని వాసులు తీవ్రమైన జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. 🤒🏡

దీనికి గల కారణాలపై పరిశోధనలు జరిపేందుకు అక్కడి దోమలను ఈ ఏడాది ఆగస్టులో పరీక్షల నిమిత్తం లాబ్‌కి పంపారు. 📚🦠 అక్కడ జరిగిన పరిశోధనల్లో జికా వైరస్ గుర్తించబడింది. 🧫🧪 ఈ వైరస్ దోమల్లో వ్యాప్తి చెంది తద్వారా మానవులకు కుట్టడం వల్ల సంక్రమిస్తుందని చెబుతున్నారు నిపుణులు. 🌡💉 ఈ వైరస్ విస్తరించి ఉన్న సుమారు ఐదు కిలోమీటర్ల పరిధిలో పోలీసులు, ఉన్నతాధికారులు ఆంక్షలను విధించారు. 🚓🌏 వ్యాధి తీవ్రత ఉన్న ప్రాంతాల్లోకి బయటి నుంచి వచ్చే కొత్త వారిని లోనికి.. లోపల నివసించే వారిని బయటకు పంపించకూడదని హెచ్చరికలు జారీ చేశారు. 🚨🏠

🌍 రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 శాంపిల్స్‌ను సేకరించారు. 🕵️📊 అందులో ఆరు చిక్కబళ్ళాపూర్‌కు చెందినవిగా గుర్తించారు. ✅🦠 వీరిలో ఐదుగురికి నెగెటివ్‌గానూ.. ఒకరికి పాజిటివ్‌గానూ వచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. 📋💊 మరో ముగ్గురికి తీవ్ర జ్వరం ఉండటంతో వీరి నమూనాలను కూడా ల్యాబ్‌కి పంపినట్లు డాక్టర్ ఎస్ మహేష్ తెలిపారు. 💉👨‍⚕️ రాష్ట్రవ్యాప్తంగా దోమల డ్రైవ్ నిర్వహించగా చిక్కబళ్ళాపూర్‌లో జికా వైరస్ దోమలు ఉన్నట్లు అక్టోబర్ 25న ఫలితాలు వచ్చాయి. 🗓️🦟 జికా వైరస్ కలిగిన దోమలను ఏడెస్ దోమలుగా పిలుస్తారు. 🐜💉 ఈ ఏడెస్ దోమ కాటు వల్ల జికా వైరస్ వ్యాపిస్తాయి. 🌏🏥 దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 🚫👥 అవసరమైన సహాయక చర్యలను చేపట్టేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. 🆘🌐 ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కూడా ఈ జికా వైరస్ ఒక వృద్దునికి వ్యాపించినట్లు లెక్కలు చెబుతున్నాయి. 🌐🏠

bottom of page