top of page
Shiva YT

🚫 కిడ్నీ సమస్యలున్న వారు మర్చిపోయి కూడా ఈ ఆహారాలు తినకూడదు..🚫

🍔 ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా... 🍔 ఫుడ్ యాప్‌ల కారణంగా ప్రాసెస్ చేసిన ఫుడ్‌కి జనాల్లో డిమాండ్ పెరిగింది. 🍔 బర్గర్లు, పిజ్జాలు వంటి ఆహారాల్లో ప్రాసెస్ చేసిన మాంసంను ఉపయోగిస్తారు. అవి కిడ్నీ ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు. 🍔

🧂 అధిక ఉప్పు ఆహారాలు 🧂 అధిక ఉప్పు ఉన్న ఆహారాలు కిడ్నీ ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు. 🧂 ప్రాసెస్ చేసిన స్నాక్స్, క్యాన్డ్ సూప్‌లలో సోడియం ఎక్కువగా ఉంటుంది. 🧂 అలాగే రోజు వారీ ఆహారాల్లో ఉప్పును తగ్గించాలి. రోజుకు 3-5 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తినకూడదు. 🧂 అన్నం, కూరల్లో కొద్దిగా ఊరగాయ పచ్చళ్లు వేసుకుని తినడం వల్ల ఆహారం రుచి పెరుగుతుంది. కానీ రోజు పచ్చళ్లు తినే అలవాటు కిడ్నీలకు అంత మంచిది కాదు. 🧂 ఊరగాయల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. 🧂

🍠 పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు 🍠 పొటాషియం ఆరోగ్యానికి అవసరమైన ముఖ్యమైన మినరల్‌. 🍠 అయితే ఈ ఖనిజాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. 🍠 అరటిపండ్లు, నారింజ, టమోటాలు వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. 🍠 బదులుగా ఆపిల్, కాలీఫ్లవర్ వంటి పండ్లు, కూరగాయలను తీసుకొవచ్చు. వీటిల్లో పొటాషియం తక్కువగా ఉంటుంది. 🍠

🥩 రెడ్ మీట్ 🥩 రెడ్ మీట్ ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది కాదు. 🥩 ప్రాసెస్ చేసిన మాంసాహారాలు కూడా కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి అంత మంచిది కాదు. 🥩 కిడ్నీ సమస్యలను పెంచడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్, రక్తపోటు, గుండె సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. 🥩 కాబట్టి ఈ రకానికి పూర్తిగా దూరంగా ఉండటం మంచిది. 🥩

🍬 షుగర్ ఫుడ్స్ 🍬 షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. 🍬 చక్కెరను కలిగి ఉన్న అనేక పానీయాలు కూడా ఉన్నాయి. 🍬 కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి ఆహారాలు తినకపోవడమే మంచిది. 🍬 అంతేకాకుండా ఇటువంటి ఆహారాలు మధుమేహం, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. 🍬

bottom of page