top of page
Shiva YT

🍽️ గంజినీళ్లు పారబోస్తున్నారా.. ? వాటిని తాగడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..? 🍽️

🏃‍♂️ మన పూర్వీకులు అప్పట్లో మనకన్నా ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. అందుకు ముఖ్య కారణం ఏంటంటే వారి ఆహారపు అలవాట్లు. సాధరణంగా మనం అన్నం వండినప్పుడు అన్నం ఉడికేటప్పుడు వచ్చే గంజిని పారపోస్తుంటాం. 🍛🍽️

🌱 కానీ మన పూర్వీకులు అలా చేసేవారు కాదు. ఆ గంజిలో ఉప్పు, నిమ్మరసం కలుపుకొని తాగేవారు. అంతేకాదు ఇలా గంజి తాగడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. అందుకే మను పూర్వీకులు మనకన్నా చాల బలిష్టంగా ఉండేవారు. 🌿💪

🥗 ప్రస్తుతం చాలామంది ఇప్పుడు గంజిని పనికి రాదని భావించి పారబోస్తుంటారు. కానీ వాస్తవానికి ఆ గంజిలోని పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. బీ, ఇ, సీ విటమిన్లు అలాగే మినరల్స్ ఉంటాయి. 🥬🌞

🤒 ముఖ్యంగా అతిసారం, కడుపు నొప్పి లాంటివాటితో ఇబ్బంది పుడుతున్నప్పుడు ఒక తిన్న గ్లాసు తీసుకొని అందులో పలచటి గంజి పోసుకోని తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది. 🍹🌿

🩺 ప్రతిరోజు గంజి తాగితే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కూడా లభిస్తుంది. అలాగే సాధారణంగా మహిళలకు వచ్చే నెలసరి నొప్పులను కూడా తగ్గిస్తుంది. 👩‍⚕️💪

💪 ముఖ్యంగా ఇందులో ఉండే రిలాక్సింగ్ లక్షణాలు కండరాల సంకోచాల ఉపశమనానికి ఎంతగానో ఉపయోగం ఉంటుంది. 🧘‍♀️🌱 చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. బరువు తగ్గించుకునేందుకు వ్యాయాలు చేయడం, డైటింగ్ చేయడం లాంటివి చేస్తుంటారు. 🏋️‍♀️🥦

🌾 ఇక్కడ మరో విషయం ఏంటంటే బరువు తగ్గాలనుకునేవారు గంజి తాగితే కూడా ఎంతగానో ఉపయోగం ఉంటుంది. 🥦🌞 ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. 🍽️

bottom of page