🩸 బ్లడ్ గ్రూప్, గుండె సంబంధిత వ్యాధులపై నిర్వహించిన పరిశోధనలో కొన్ని బ్లడ్ గ్రూప్‌లు ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ద్వారా తెలుస్తోంది.
పరిశోధన ప్రకారం A, B బ్లడ్ గ్రూప్‌ల వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు బ్లడ్ గ్రూపులు ఉన్నవారిలో రక్తం గడ్డకట్టే గుణం ఎక్కువ ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూపులు ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం. ఇంకా చెప్పాలంటే ఇతర బ్లడ్ గ్రూప్ ల వారి కంటే ఈ రెండు బ్లడ్ గ్రూప్ లు ఉన్నవారికి గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుందని పరిశోధలు కూడా చెబుతున్నాయి. 🩸