top of page

రాష్ట్రంలో హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించాలి.. కేటీఆర్ ట్వీట్


రాష్ట్రంలో డెంగీ మ‌ర‌ణాల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో డెంగీ మ‌ర‌ణాలు లేవ‌ని ప్ర‌భుత్వం చెబుతుంది. కానీ వార్తా ప‌త్రిక‌ల్లో మాత్రం ఒక్క‌రోజులో ఐదు మంది డెంగీతో చ‌నిపోయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. డెంగీతో మ‌రో ముగ్గురు చ‌నిపోయిన‌ట్లు ఇవాళ కూడా వార్తా ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌చ్చాయి. ఈ డేటాను ఎవ‌రు దాచిపెడుతున్నారు..? ఎందుకు దాచిపెడుతున్నారు..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో స‌రిపడా మందులు లేవు.. చాలా హాస్పిట‌ల్స్‌లో ఒక్కో బెడ్‌పై ముగ్గురు, న‌లుగురు ఉండి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నార‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ఈ ప‌రిస్థితిని సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించి, రాష్ట్రంలో హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించాల‌ని సీఎస్ శాంతికుమారికి కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు.



Komentar


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page