top of page
Suresh D

ఓడితే ప్లే ఆఫ్స్ నుంచి బెంగళూరు ఔట్..🏏🏆

IPL 2024లో, సీజన్‌లోని 30వ మ్యాచ్ ఏప్రిల్ 15న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (RCB vs SRH) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుత సీజన్‌లో ఆర్‌సీబీ ఆరు మ్యాచ్‌లు ఆడిన ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేయగలిగింది. అదే సమయంలో హైదరాబాద్ జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడగా మూడింటిలో విజయం సాధించింది.

ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. బెంగళూరు జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించే అంచున ఉంది. RCB బ్యాటింగ్, బౌలింగ్ రెండూ లయ తప్పినట్లు కనిపిస్తున్నాయి. కొన్ని మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మెన్స్ రాణిస్తున్నా.. బౌలర్ల ప్రదర్శన పూర్తిగా పేలవంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరు జట్టు వీలైనంత త్వరగా సమష్టిగా రాణించాల్సి ఉంటుంది.

మరోవైపు, పాట్ కమిన్స్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు మంచి ప్రదర్శన కనబరిచింది. హైదరాబాద్ జట్టు తన గత రెండు మ్యాచ్‌లను గెలుచుకుంది. హైదరాబాద్ జట్టు నుంచి సమిష్టి ప్రదర్శన కనిపించింది. అందుకే కొన్ని మ్యాచ్‌లలో ప్రధాన పేర్లు ఫ్లాప్ అయినప్పటికీ, ఫలితం అనుకూలంగా వచ్చింది. కమిన్స్ తన జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించేలా చూసేందుకు ప్రయత్నిస్తాడు.IPL చరిత్రలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఇప్పటివరకు 23 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచ్‌లను గెలుచుకోగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య ఒఖ మ్యాచ్ రద్దు అయింది. IPL 2023లో ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక మ్యాచ్‌లో RCB ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.🏏🏆 

bottom of page