పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. “సినిమా హిట్టయితే చాలా మంది ఫోన్ చేసి ప్రశంసిస్తారు. ప్లాప్ అయినా నాకు ఓ కాల్ వచ్చింది. అది కూడా విజయేంద్ర ప్రసాద్. నాకో సాయం చేస్తారా ? అని అడిగారు. ఆయన కుమారుడు రాజమౌళి డైరెక్టర్.నేనేం హెల్ప్ చేయాలని మనసులో అనుకున్నాను. మీ నెక్ట్స్ మూవీ ఎప్పుడూ చేస్తున్నారు.. ?మీరెప్పుడు చేసినా ఆ సినిమా కథ నాకు చెబుతారా..? అని అడిగారు. ఆయనెందుకు అలా అంటున్నారో కాస్త అర్థమయ్యింది. మీలాంటి డైరెక్టర్స్ ఫెయిల్ కావడం నేను చూడలేను. చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. అందుకే తీసే ముందు నాకు ఒక్కసారి చెప్పండి అని అన్నారు. ఆయన మాటలకు ఎమోషనల్ అయ్యాను. నాపై అభిమానంతో చేసిన ఆ కాల్ ఎప్పటికీ మర్చిపోలేను. అయితే ఈ స్టోరీ గురించి మాత్రం ఆయనకు చెప్పలేదు. జాగ్రత్తగా రూపొందించి.. నేరుగా సినిమాను చూపించాలనుకున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
తెలుగు దర్శకుల్లో అత్యంత ప్రతిభ ఉన్న దర్శకుల్లో పూరీ జగన్నాథ్ ఒకరు. విజయేంద్రప్రసాద్‌కి పూరీ జగన్నాథ్ అంటే చాలా ఇష్టం. పూరీ జగన్నాథ్ ప్రతిభకు, సినిమా పై ప్యాషన్, స్టైల్ కు వీరాభిమాని. అందుకే పూరీ జగన్నాథ్‌లా ఉండాలనే కోరికతో ఆయన చిత్రాన్ని మొబైల్ వాల్‌పేపర్‌గా పెట్టుకున్నారు విజయేంద్ర ప్రసాద్.