రోజంతా టీవీ చూడకుండా అయినా ఉంటామేమో గానీ, యూట్యూబ్ చూడకుండా పూట గడవడం కష్టంగా మారింది! ఎప్పుడూ చూసేదే అయినా.. కాస్త కొత్తగా ఎందుకు ట్రై చేయొద్దు చెప్పండి! ఇకపై యూట్యూబ్‌ను ఇలా కొత్తగా చూడండి. అందుకు ఒక ప్రత్యేక ‘ఎక్స్‌టెన్షన్’ని క్రోమ్ వెబ్‌స్టోర్ నుంచి బ్రౌజర్‌కి జత చేయవచ్చు. Enhancer for YouTube.. దీన్ని యాడ్ చేసుకున్నాక యూట్యూబ్ ప్లేయర్‌లో కొత్త ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిని వాడుకుని డెస్క్‌టాప్‌పై మీ పనికి తగినట్టుగా ప్లేయర్‌ని సెట్ చేసుకుని హ్యాపీగా వీడియోలు చూడొచ్చు. ఇంకా వివరంగా చెప్పాలంటే..
ఎక్స్‌టెన్షన్‌ని బ్రౌజర్‌కి జత చేయగానే వరుసగా కంట్రోల్ బటన్స్ కనిపిస్తాయి. డీఫాల్ట్‌గా ప్లేయర్‌లో ఉండే వాటికి భిన్నంగా ఈ కంట్రోల్స్ పనిచేస్తాయి. ఎలాగంటే.. ప్లే అవుతున్న వీడియో మాత్రమే కనిపించాలి. మిగతావన్నీ కనిపించకుండా తెర మొత్తం చీకటైపోవాలంటే.. అందుకు ‘సినిమా మోడ్’ ఎంచుకోవచ్చు. తెరమొత్తం వీడియో ప్లే చేయాలంటే ‘ఎక్స్‌పాండ్’ చేసుకునే కంట్రోల్ ఉంది. తక్కువ సౌండ్‌తో ప్లే అవుతున్న వీడియోల వాల్యూమ్‌ని పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది. అంతేకాదు.. వీడియోలో ఏదైనా ఫ్రేమ్‌ని ఫొటో తీయాలనుకుంటే ‘క్లిక్’మనిపించొచ్చు.
ఇక చివరిగా.. ‘పాప్ అప్ ప్లేయర్’. ఇది చాలా ప్రత్యేకం. ఇప్పటివరకూ మీరు వీడియోలను యూట్యూబ్ ట్యాబ్‌లోనే ప్లే చేసి ఉంటారు. అలాకాకుండా.. ప్లే అవుతున్న వీడియోని బయటికి లాగేసి.. తెరపై మీకు కావాల్సిన చోట పెట్టకుని ప్లే చేసుకుంటే? చాలా సుఖంగా అనిపిస్తుంది కదా..! డెస్క్‌టాప్‌పై పని ఓ పక్కా.. ప్లేయర్ మరో పక్కా.. సెట్ అయిపోతుంది. ప్లేబ్యాక్ వీడియో క్వాలిటీని కూడా డిఫాల్ట్‌గా సెట్ చేయొచ్చు. మరిన్ని భిన్నమైన ఆప్షన్లు ఉన్నాయి. ఏక్ బార్ ట్రై కరో!! https://rb.gy/ciqf4u లింక్‌లోకి వెళ్లి Enhancer for YouTube మీ బ్రౌజర్‌కి జత చేయండి.