top of page

నిఖిల్ పై విరుచుకుపడిన యష్మీ.. ప్రోమో చూశారా..?


తాజాగా విడుదలైన ప్రోమోలో ఇద్దరు దోస్తుల మధ్య చిచ్చు పెట్టేశాడు బిగ్‏బాస్ . షో మొదటి రోజు నుంచి మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు నిఖిల్, యష్మీ. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఇద్దరు ఒకే మాట మీద ఉంటున్నారు. ఇక యష్మీ చీఫ్ కావడానికి మెయిన్ రీజన్ నిఖిల్. నైనిక నబీల్ పేరు చెప్పగా.. నిఖిల్ మాత్రం యష్మీ చీఫ్ కావాలంటూ నైనికను ఒప్పించాడు. దీంతో నిఖిల్, నైనికతోపాటు యష్మీ కూడా చీఫ్ అయ్యింది. చివరకు ఇప్పుడు ఇద్దరు బడ్డీస్ మధ్య పెద్ద గొడవే జరిగినట్లుగా తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో.. రెండు క్లాన్స్ మధ్య సెకండ్ టాస్క్ మొదలైంది.

రెండు టీం సభ్యులు చైన్ సిస్టంలాగా నిలబడి చేతులతో పట్టుకోకుండా శరీరాల మీదుగానే రింగ్స్ ఓవైపు నుంచి మరోవైపుకు చేరవేయాల్సి ఉంటుంది. అయితే యష్మీ టీం రింగ్స్ అన్నింటిని శరీరాం మొత్తాన్ని తిప్పి తీసుకెళ్తారు. కానీ నైనిక టీం మాత్రం కేవలం మెడ చేతుల నుంచి మాత్రమే రింగ్స్ తీసుకువస్తారు. ఈ టాస్కులో నైనిక టీం ముందుగా రింగ్స్ అన్నింటిని మరోవైపుకు చేరవేయడంతో నైనిక టీం గెలిచిందని ప్రకటిస్తాడు నిఖిల్. దీంతో యష్మీ టీం గొడవకు దిగుతుంది. బిగ్‏బాస్ శరీరం మొత్తం తిప్పి రింగ్స్ తీసుకురావాలని చెప్పారని చెప్పడంతో శరీరం మొత్తం అని చెప్పలేదు.. శరీరం నుంచి అని చెప్పారంటూ నైనిక టీం వాదిస్తుంది. ఇక నిఖిల్ కూడా నైనిక టీంకు సపోర్ట్ చేయడంతో యష్మీ రెచ్చిపోయింది. రూల్స్ బ్రేక్ చేస్తున్నారంటూ నిఖిల్ తో గొడవకు దిగింది. అటు నిఖిల్ కూడా యష్మీకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మొత్తానికి రెండో టాస్కుతో దోస్తులు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాడు బిగ్‏బాస్ .


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page