ఆర్తి అగర్వాల్.. అసలు ఒకప్పుడు ఈ హీరోయిన్‌కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రెండు దశాబ్దాల క్రీతం టాలీవుడ్‌లో సెన్సేషనల్ స్టార్‌గా ఒక ఊపు ఊపేసింది.
2001లో వెంకీమామ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఆర్తి అగర్వాల్. తొలి సినిమానే తిరుగులేని హిట్టుగా నిలిచింది. ఇక ఈ మూవీ యూత్‌లో ఆర్తికు పిచ్చ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నువ్వులేక నేను లేను, ఇంద్ర, వసంతం, నేనున్నాను.. ఇలా బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లతో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా నిలిచింది.
చిరంజీవి, వెంకటేష్, బాలయ్య, నాగార్జున వంటి సీనియర్ హీరోల నుంచి ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు ఇలా ఇప్పటి స్టార్ హీరోలతో కూడా ఆర్తి అగర్వాల్ సినిమాలు చేసింది. చివరిగా ఆర్తి అగర్వాల్ ఆమె ఎవరు సినిమాలో నటించింది.
ఇక అప్పట్లో తరుణ్‌తో ఆర్తి అగర్వాల్ డేటింగ్‌లో ఉందని, వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు మాములుగా వైరల్ కాలేవు. అంతేకాకుండా వీరిద్దరి ప్రేమను కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని కూడా రూమర్స్ వచ్చాయి. కాగా ఈ వార్తలను అప్పుడు తరుణ్ పేరెంట్స్ కూడా స్పందించారు.
అయితే ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ సినిమాలలో కనిపించడం చాలా వరకు తగ్గిపోయింది. అవకాశాలు కూడా రాలేవు. దాంతో కొంత కాలం సినిమాలుక గ్యాప్ కూడా ఇచ్చింది. కాగా అలా ఆర్తి కెరీర్ నాశనం అవడానికి ఆయన తండ్రే కారణం అని టాలీవుడ్ నిర్మాత చంటీ అడ్డాల తెలిపి షాక్ ఇచ్చాడు.
ఆ మధ్య ఓ ఇంటర్వూలో చంటీ మాట్లాడుతూ ఆర్తి అగర్వాల్ మా బ్యానర్‌లో అల్లరి రాముడు, అడవి రాముడు సినిమాలు చేసింది. ఆర్తి అగర్వాల్ సెట్స్‌లో చాలా హుషారుగా ఉండేది. కానీ వాళ్ళ నాన్న వస్తే మాత్రం చాలా సైలెంట్ అయిపోతుంది చంటీ చెప్పాడు.
అంతేకాకుండా ఆర్తి అగర్వాల్ పైన ఆమె తండ్రి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేదని, సినిమాల ఎంపికతో పాటు కెరీర్ విషయంలో తన తండ్రే నిర్ణయాలు తీసుకునేవాడని తెలిపాడు. తన తండ్రి వల్లే ఆర్తి అగర్వాల్ డిప్రెషన్ గురైందని అన్నాడు.
బరువు తగ్గేందుకు లైపోసక్షన్ చేయించుకోవడం కారణంగానే ఆర్తి అగర్వాల్ 2015లో మరణించింది. కాగా అలా చేసుకోమని తన తండ్రే బలవంతం పెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి వాటిల్లో నిజమెంతుందో మాత్రం తెలియదు.