top of page

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న హర్ష సాయి.? నిర్మాత ఎవరంటే..

యూట్యూబర్ హర్ష సాయి.. సోషల్ మీడియాలో ఈ పేరుకున్న క్రేజ్ అంతాఇంతా కాదు. యూట్యూబ్ ద్వారా తాను సంపాదించిన డబ్బుతో పేదలకు సాయం చేస్తూ.. ఇలా నెట్టింట సంచలనంగా మారాడు ఈ వ్యక్తి. అటు సమాజసేవా కార్యక్రమాలతో..

యూట్యూబర్ హర్ష సాయి.. సోషల్ మీడియాలో ఈ పేరుకున్న క్రేజ్ అంతాఇంతా కాదు. యూట్యూబ్ ద్వారా తాను సంపాదించిన డబ్బుతో పేదలకు సాయం చేస్తూ.. ఇలా నెట్టింట సంచలనంగా మారాడు ఈ వ్యక్తి. అటు సమాజసేవా కార్యక్రమాలతో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను పెంచుకున్నాడు. యూట్యూబ్‌లో 8.64 మిలియన్లు, ఇన్‌స్టాలో 4 మిలియన్లు, ఫేస్‌బుక్‌తో ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లలో కలిపి ఏకంగా 10 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ హర్ష సాయి సొంతం. ఇదిలా ఉంటే.. అటు రాజకీయాల్లోకి లేదంటే ఇటు సినిమాల్లోకి హర్ష సాయి వస్తాడంటూ గతకొద్దిరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి హర్ష సాయి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని ఓ వార్త మీడియా వర్గాల్లో హల్చల్ చేస్తోంది.బిగ్ బాస్ ఫేం మిత్రా శర్మ ఈ సినిమాను నిర్మించనున్నాడని తెలుస్తోంది. దీనిలో హీరోగా మాత్రమే కాదు.. దర్శకుడిగా కూడా హర్ష సాయి వ్యవహరించబోతున్నట్లు టాక్. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉండొచ్చునని తెలుస్తోంది. తన సేవాగుణంతో ఎంతోమంది కుటుంబాల్లో వెలుగులు నింపిన హర్ష సాయి.. సినిమాల్లో కూడా రాణించాలని కోరుకుందాం.




Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page