చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా మీదే ఫోకస్ పెట్టాడు. బింబిసార వశిష్ట ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలుపెట్టాడు. మారెడుమిల్లి ఏరియాలో చిరంజీవి లేని సీన్లను తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే చిరంజీవి సైతం సెట్స్‌లో అడుగు పెట్టబోతోన్నాడు. ఈ క్రమంలోనే చిరంజీవి సైతం కసరత్తులు మొదలుపెట్టాడు. అయితే చిరంజీవికి సంబంధించిన నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద చర్చలు స్టార్ట్ అయ్యాయి. బీవీఎస్ రవి అందించే కథతో హరీష్ శంకర్ సినిమా చేస్తాడని రూమర్ చక్కర్లు కొడుతోంది.
చిరంజీవి తన కూతురు సుస్మిత కొణిదెల బ్యానర్‌లో ఓ సినిమా చేస్తాడని ఇది వరకే ప్రకటించాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఆ సినిమా ఉంటుందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఇంకోలా వార్తలు వినిపిస్తున్నాయి. సుస్మిత, పీపుల్స్ మీడియా సంయుక్తంగా సినిమాను నిర్మిస్తుందట. బీవీఎస్ రవి అందించే కథతో హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తాడట. అలా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రూమర్లు మాత్రం నెట్టింట్లో బాగానే వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర కోసం కష్టపడుతున్నారు. విశ్వంభర సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమా మీదే చిరు కూడా ప్రస్తుతం ఫుల్ ఫోకస్ పెట్టారు. ముందుగా తన కూతురు సుస్మిత బ్యానర్‌లో చిరంజీవి ఓ సినిమాను చేయాల్సి ఉంది. కానీ వశిష్ట కథను ముందుకు తీసుకొచ్చారు చిరంజీవి. 🎭🎬