top of page

🚨 మరోసారి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ హరీష్‌రావు..

📜 కాంగ్రెస్ సర్కారు హయాంలో తుమ్మలు తప్ప నీళ్ళు రాలేదని, నర్సంపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతుందని,

తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్ గా ఉందని, నిరంతర కరెంట్ ఇవ్వడంలో నెంబర్ వన్, రైతు బంధు ఇవ్వడంలో నెంబర్ వన్ గా ఉందని, కాంగ్రెస్ హయాంలో మూడు ధర్నాలు ఆరు అరెస్టులతో విజృంభిస్తోందని, మెడికల్ కాలేజీ, చదువుతో పాటు వైద్యం అందుబాటులోకి వస్తుందని, ఎంజిఎం లాంటి ఆసుపత్రి నర్సంపేటకు వచ్చిందని మెచ్చుకున్నారు మంత్రి హరీష్‌రావు. 🗣️ కాంగ్రెస్ వాళ్ళు వస్తే 6 గ్యారెంటీలు కాదు, ఆరుగురు ముఖ్యమంత్రులు వస్తారని, మత కలహాలు, కొట్లాటలు వస్తాయని హెచ్చరించారు. 10 కోట్లకు పీసీసీ అధ్యక్షుడు టికెట్ అమ్ముకున్నారని, అధికారం కోసం ఎన్ని కుట్రలు అయినా చేస్తారని హరీష్‌రావు విమర్శించారు. టికెట్లు అమ్ముకున్న వాళ్ళు.. రాష్ట్రాన్ని అమ్ముకుంటారని, బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్సే అని ధీమా వ్యక్తం చేశారు మంత్రి హరీష్‌రావు. 📢

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page