top of page
Suresh D

వెనుక నుంచి వాటేసుకున్న హార్దిక్.. ఊహించని రియాక్షన్‌


ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి.. హార్దిక్ పాండ్యకు నాయకత్వ పగ్గాలు అప్పగించిన నాటి నుంచి.. వారిద్దరూ ఐపీఎల్‌ సమయంలో ఒకరితో మరొకరు ఎలా మెలుగుతారనేది ఆసక్తికరంగా మారింది. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య తొలి మ్యాచ్ సమయంలో.. ఫలితం కంటే ఎక్కువగా హార్దిక్ పాండ్యపైనే ఫ్యాన్స్ ఫోకస్ పెట్టారంటే అతిశయోక్తి కాదు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత ఆకాశ్ అంబానీ, రషీద్ ఖాన్ తదితరులతో రోహిత్ శర్మ మాట్లాడుతుండగా.. హార్దిక్ పాండ్య వచ్చి వెనుక నుంచి హిట్ మ్యాన్‌ను హగ్ చేసుకున్నాడు. భయ్యా.. అంటూ తాను హగ్ చేసుకుంటే.. రోహిత్ అరే యార్.. అంటూ ప్రేమగా మాట్లాడుతాడని హార్దిక్ ఎక్స్‌పెక్ట్ చేశాడు కాబోలు. కానీ గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన బాధలో ఉన్న హిట్ మ్యాన్‌కు మాత్రం ఇది చిరాకు తెప్పించింది. వెంటనే హార్దిక్ కౌగిలి నుంచి విడిపించుకున్న రోహిత్.. వెనక్కి తిరిగి హార్దిక్‌తో సీరియస్‌గా ఏదో విషయమై మాట్లాడాడు. దీంతో ముంబై కెప్టెన్ ముఖంలో హవభావాలు మారిపోయాయి. రోహిత్ శర్మ సీరియస్‌గా మాట్లాడుతుంటే.. హార్దిక్ దాదాపుగా ఏమీ మాట్లాడకుండా అలా వింటూ ఉండిపోయాడు. ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కడంతో.. నెటిజన్లు వీడియోను పోస్ట్ చేసి.. రోహిత్, హర్దిక్ మధ్య సంబంధాలు బాగోలేనట్టున్నాయని అభిప్రాయపడుతున్నారు.


bottom of page