top of page

నా కోసం మీకు ఏమి తెలుసు ?🏏✨

హార్దిక్ పాండ్య ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడాడు. ఇందులో తన వ్యక్తిగత జీవితం గురించి వ్యాఖ్యలు చేశాడు. బయట తిరగడం కంటే ఇంట్లో ఉండటానికే ఎక్కువ ఇష్టపడతానని పేర్కొన్నాడు.

''నా గురించి నా అభిమానులకు తెలియని విషయం ఏంటంటే.. నేను బయటకు ఎక్కువగా వెళ్లను. ఇంట్లో ఉండటానికే ఇష్టపడతా. తప్పని పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్తా. గత మూడు నాలుగేళ్లలో నేను వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. అవి కూడా స్నేహితుల కోసమే వెళ్లి ఉంటా. ఇంట్లోనే ఉంటుంటా'' ''ఇటీవల ఇంట్లో నుంచి 50 రోజుల పాటు బయటకు రాలేదు. కనీసం ఇంట్లో ఉన్న లిఫ్ట్‌ను కూడా చూడలేదు. ఇంట్లోనే జిమ్, థియేటర్, నాకు కావాల్సినవి అన్నీ ఉంటాయి'' అని హార్దిక్ పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో సూపర్ కార్లతో వైరల్ అయిన తన ఫొటోల గురించి హార్దిక్ స్పందించాడు. టెస్టు డ్రైవ్ కోసం ఒకరు తన వద్దకు కారును పంపించారని చెప్పాడు. ఇక మీడియాలో తాను మాట్లాడనని, ఇప్పటివరకు అది చేయలేదని చెప్పాడు. ఇలా ఉండటం తనకేం బాధ కలిగించలేదని పేర్కొన్నాడు.


bottom of page