top of page

👩‍⚖️ మహిళ జడ్జ్‌కు న్యాయవాది వేధింపులు.. సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

📅 మొదట ఒక కాలేజ్ ఫంక్షన్ కి ఉమెన్స్ డే కార్యక్రమానికి వెళ్ళిన మహిళా న్యాయమూర్తికి విషెస్ చెప్పడానికి న్యాయవాది ప్రయత్నించాడు.

ఆ తర్వాత న్యాయమూర్తి చాంబర్‌లో ఒక స్పెషల్ పెన్నును పెట్టాడు. ఆ పెన్నుపై తన పేరుతో పాటు మహిళ న్యాయమూర్తి పేరును జోడిస్తూ ఉంది. ఇది గమనించిన మహిళా న్యాయమూర్తి న్యాయవాది ప్రవర్తన చూసి నివ్వెర పోయింది. ఆ తరువాత మహిళ న్యాయమూర్తి ఇంటి పరిసరాల్లోనూ న్యాయవాది కనిపించాడు. మరోసారి న్యాయవాదిని పిలిచి మహిళా మేజిస్ట్రేట్ వార్నింగ్ ఇచ్చింది. అయినా సరే అతడి వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాలేదు.

📢 ఈ విషయంపై తెలంగాణ బార్ కౌన్సిల్ సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. పలుమార్లు న్యాయవాది శ్రీనివాసులు హెచ్చరించినప్పటికీ అతడు మారకపోవడంతో బార్ కౌన్సిల్ నుంచి అతన్ని సస్పెండ్ చేసింది. ఈ ఉదాంతం పై హైకోర్టులో సైతం విచారణ జరిగింది. ఈ ఘటనపై సుమోటోగా హైకోర్టు కేసును విచారణకు స్వీకరించింది. సదరు న్యాయవాదిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అతనిపై తీసుకున్న చర్యలకు సంబంధించి నాలుగు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 🏛️


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page