top of page
Suresh D

హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్.. ఎందుకంత ట్రోలింగ్..?🎥✨

హనుమాన్ సినిమా ఆదివారం నాడు ఓటీటీలోకి వచ్చింది. ఇక హనుమాన్ ఓటీటీ కోసం ఎదురుచూసిన ఆడియెన్స్‌కు పండుగలా మారింది. కానీ కొంత మంది మాత్రం హనుమాన్ సినిమాను తక్కువ చేసి ట్రోలింగ్ చేస్తున్నారు.

హనుమాన్ సినిమా ఆదివారం నాడు ఓటీటీలోకి వచ్చింది. ఇక హనుమాన్ ఓటీటీ కోసం ఎదురుచూసిన ఆడియెన్స్‌కు పండుగలా మారింది. కానీ కొంత మంది మాత్రం హనుమాన్ సినిమాను తక్కువ చేసి ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది అసలు సినిమా? దీని వీఎఫ్ఎక్స్ గురించా? ఇంతలా అందరూ మాట్లాడుకున్నారు.. టీవీ సీరియల్ రేంజ్ గ్రాఫిక్స్ పట్టుకుని చాలా లేపారు కదా? అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలాంటి సినిమా అంత భారీ కలెక్షన్లు ఎలా వచ్చాయ్? అసలు చివరి 20 నిమిషాలంటూ లేకపోతే.. ఈ సినిమా బిలో యావరేజ్ కదా? అని ట్రోలింగ్ చేస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం మూడు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ రేంజ్‌లో హిట్టవ్వడంతోనే ఓటీటీలోకి ఆలస్యంగా వచ్చింది. సంక్రాంతి బరిలో దిగిన చిత్రాలన్నీ ఓటీటీలోకి వచ్చాయి. గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగా అన్నీ కూడా ఓటీటీలోకి వచ్చి సైడ్ అయిపోయాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో హనుమాన్ సాగుతోంది. కానీ ఈ మూవీ మీద పనిగట్టుకుని కొంత మంది ట్రోలింగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

సంక్రాంతి హడావిడి, దిల్ రాజు నాగవంశీలు గుంటూరు కారం మీద చేసిన రచ్చ.. హనుమాన్‌కు థియేటర్లు ఇవ్వకపోవడం ఇలాంటవన్నీ కలిసి.. ఆ మూవీకి బజ్ వచ్చేలా చేశాయని, లేకపోతే ఆ రేంజ్‌లో హిట్టయ్యేది కాదని అంటున్నారు. హనుమాన్ సినిమా మీద మహేష్ బాబు ఫ్యాన్స్ కావాలనే ఇలా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. 🎥✨

bottom of page