top of page

కొనసాగుతున్న హనుమాన్ కలెక్షన్ల హవా.. మరో మైలురాయి దాటిన మూవీ✨💰

హనుమాన్ సినిమా కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. అంచనాలకు మించి భారీ బ్లాక్‍బాస్టర్ దిశగా ఈ చిత్రం దూసుకెళుతోంది. ఈ సినిమా వసూళ్లలో మరో మైలురాయిని దాటింది.✨💰

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ (హను-మ్యాన్) సినిమా కలెక్షన్లలో దూసుకెళుతోంది. తక్కువ బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ మూవీ.. భారీ వసూళ్లతో సంచలనం సృష్టిస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైన ఈ సూపర్ హీరో మూవీకి ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో హనుమాన్‍కు కలెక్షన్ల జోరు కొనసాగుతూనే ఉంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. హనుమాన్ సినిమా ఏడు రోజుల కలెక్షన్లపై మూవీ యూనిట్ అప్‍డేట్ ఇచ్చింది. 

హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల్లో రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఈ విషయాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‍మెంట్ అధికారికంగా ప్రకటించింది. చిన్న మూవీగా వచ్చిన హనుమాన్ వారంలోనే ఈ మైలురాయి దాటడం విశేషంగా ఉంది. అంచనాలకు మించి అన్ని చోట్ల ఈ మూవీకి భారీ కలెక్షన్లు వస్తున్నాయి.

హనుమాన్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటి వరకు సుమారు రూ.65కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. హిందీలో రూ.30కోట్ల మార్కుకు ఈ చిత్రం చేరువైంది. విదేశాల్లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు రూ.37 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇతర భాషల్లోనూ ఈ చిత్రానికి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ వీకెండ్‍లోనూ హనుమాన్ చిత్రానికి కలెక్షన్ల జోరు మరింత పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. భారత్‍తో పాటు ఓవర్సీస్‍లోనూ మంచి వసూళ్లను రాబడుతోంది ఈ చిత్రం. ఇప్పటికే మూడు రెట్ల లాభాలు వచ్చినట్టు తెలుస్తోంది.✨💰


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page