top of page

హనుమాన్‌లో హిందూ మతం లేదు.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కామెంట్స్🎥✨

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ అంటే హిందూ మతం కాదని, అందులో మత ప్రస్తావనే లేదని, కల్చర్‌లోనే ఆయన పాతుకుపోయాడని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. డీసీ, మార్వెల్ సూపర్ హీరో సినిమాలా హనుమాన్ ఉండదని హెచ్‌టీకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో తెలిపారు.

2021లో హనుమాన్ సినిమా ప్రకటించినప్పటి నుంచి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో మొదటిసారిగా ఒక సూపర్ హీరో చిత్రం వస్తుందని భారీగా బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా చుట్టూ ఉన్న క్రేజ్, బజ్ మరెవరో కాదు హనుమంతుడే అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్నారు. తాజాగా హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"ఇదంతా హనుమంతుడి వల్లే జరిగింది. మేము ప్రస్తుతం ఢిల్లీలోని ఒక పురాతన హనుమాన్ ఆలయాన్ని సందర్శించాం. హనుమాన్ ఆలయంలో ఉన్నంత జనసమూహాన్నినేను ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడలేదు. చాలా మంది ఆయనను ప్రేమిస్తారు, ఆరాధిస్తారు. వారు అతన్ని ప్రార్థించే విధానం మరొక స్థాయిలో ఉంటుంది. సినిమా చుట్టూ బజ్ 99% హనుమాన్‌ది ఉంటే కేవలం ఒక శాతం మాత్రం నా కంటెంట్" అని తన ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు.

హనుమంతుడిలో హిందూ మతం ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, అన్ని మతాలకు అతీతంగా అందరినీ ఆకట్టుకుంటుందా? అన్నదానికి.. ''ఈ సినిమాలో మతం ప్రస్తావనే లేదు. హనుమంతుడి పాత్ర మాత్రమే ఉంది. హనుమంతుడిని గౌరవించే, ప్రేమించే ఇతర మతాలకు చెందిన వారు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్‌లో పనిచేసిన చాలా మంది ఇతర మతాలకు చెందిన వారే. మా టీమ్ అంతా ఈ సినిమాకి బెస్ట్ ఇచ్చారు. హనుమంతుడు అన్ని వయసుల వారిని మెప్పించే విధంగా ఉండబోతుంది. ఈ సినిమాలో మీకు ఇబ్బంది కలిగించే ఒక్క ఎలిమెంట్ కూడా లేదు. మీరు మీ కుటుంబంతో కలిసి వెళ్లి, సరదాగా గడపవచ్చు'' అని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు.🎥✨

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page