top of page

🎥 హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో రికార్డ్ క్రియేట్ చేసిన హనుమాన్ 🎬

ఈ సంక్రాంతికి భారీ సినిమాలు పోటీ పడ్డాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ, వెంకటేష్ సైంధవ్ సినిమాలతో పాటు తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమా కూడా రిలీజ్ అయ్యింది.

చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. బరిలో బడా సినిమాలు ఉన్నా కూడా వెనకడుగు వేయకుండా సినిమా అనుకున్న తేదీకి రిలీజ్ చేశారు. అనుకున్నట్టుగానే ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే 100కోట్లవరకు వసూల్ చేసుంది హనుమాన్. తెలుగులోనే కాదు పలు భాషల్లోనూ రిలీజ్ అయ్యి అన్ని ఏరియల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతే కాదు కొన్ని ఏరియాల్లో రికార్డ్ కూడా క్రియేట్ చేసింది.

9 రోజుల్లో రూ. 1 కోటి గ్రాస్ ని కలెక్ట్ చేసింది హనుమాన్ సినిమా. హనుమాన్ సినిమాలో తేజ సజ్జ సరసస అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు. వినయ్ రాయ్ ఈ సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించారు. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ వీఎఫెక్స్ తో ప్రేక్షకులను అలరించింది. 🎉

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page