top of page
Shiva YT

🌊 వైసీపీ – టీడీపీ మద్య హంద్రీనీ’వార్’..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం పాలిటిక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన తర్వాత మరింత హీట్‌గా మారాయి. 🌡️ హంద్రీనీవా నీటి వ్యవహారం టీడీపీ – వైసీపీలకు రాజకీయ ఆయుధంగా మారింది. కుప్పంకు నీళ్లు ఇచ్చిన క్రెడిట్ తమదేనంటున్న వైసీపీ, వైసీపీ ది షోఅప్ అంటున్న టీడీపీ. ఇలా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా కుప్పంలో పర్యటించిన సీఎం హంద్రీనీవా నీటిని కుప్పంకు అందించడంతో హంద్రీనీవా ఇష్యూ హాట్ టాపిక్ గా మారిపోయింది.

672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం నుంచి కృష్ణమ్మను కుప్పంకు తీసుకొచ్చామన్నారు సీఎం వైఎస్ జగన్. కుప్పంకు నీళ్లు ఇచ్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా మన్నారు. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా మూడు సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఎందుకు కుప్పంకు నీళ్లు తీసుకుని రాలేదని ప్రశ్నించడంతో ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన సందర్భమన్న సీఎం ఎంతో గర్వపడుతున్నా నన్నారు. లాభాలు ఉన్న పనులే చంద్రబాబు చేశారని ఇది వరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానన్నారు. మరో రెండు రిజర్వాయర్ల నిర్మాణంకు శ్రీకారం చుట్టామని సీఎం జగన్ తెలిపారు.

Comments


bottom of page