top of page
MediaFx

ఈ రకమైన డ్రింక్స్ తాగితే బట్టతల బారిన పడతారట


జుట్టు అంటే అందరికి ఇష్టమే.. స్త్రీలు పొడవైన ఒత్తైన జుట్టుని ఇష్టపడితే.. మగవారు బట్టతల లేకుండా జుట్టు ఒత్తుగా ఉండాలని కోరుకుంటారు. అయితే ప్రస్తుతం జుట్టు రాలడం అనే సమస్యని ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నారు.  అయితే రోజూ డ్రింక్స్ తాగడం వల్ల కూడా బట్టతల బారిన పడతారని మీకు తెలుసా. కొన్ని రకాల డ్రింక్స్ తాగే అలవాటున్న పురుషుల్లో జుట్టు రాలిపోయే సమస్య అధికంగా ఉంటుంది. జుట్టుకు మీ అలవాట్లే శత్రువులుగా ఎలా మారుతున్నాయో తెలుసా.. వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు బట్టల బాధితులుగా మారుతున్నారు. మరి ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం..

ఎనర్జీ డ్రింక్స్..

ఎనర్జీ డ్రింక్స్ లేదా చక్కెర పానీయాలు తాగడం అలవాటు ఉన్నవారిలో జుట్టు రాలడం అధికంగా ఉంటుందని.. బట్టతల సమస్య ఎదుర్కోవలసి ఉంటుందని చైనా పరిశోధకులు తెలిపారు. ఈ ఎనర్జీ డ్రింక్స్ ప్రభావం పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అధ్యయనం ప్రకారం, 13 నుండి 29 సంవత్సరాల వయస్సు గల వారు దీని బారిన పడుతున్నారు.

అధ్యయనం ఎలా జరిగిందంటే..?

ఈ అధ్యయనాన్ని 1000 మంది పురుషులపై చేశారు. ముందుగా వారానికి 3 లీటర్ల ఎనర్జీ డ్రింక్స్ తాగాలని సూచించారు. పరిశోధన తర్వాత రోజుకు ఒకటి కంటే ఎక్కువ  ఎనర్జీ డ్రింక్స్ తాగిన వ్యక్తికి జుట్టు రాలిపోయే ప్రమాదం 42 శాతం ఎక్కువగా ఉందని పరిశోధనలో తెలిసినట్లు వెల్లడించారు.

హాని కలిగిస్తున్న ఫాస్ట్ ఫుడ్

ఫాస్ట్ ఫుడ్ అలవాటు ఉన్నవారు లేదా తక్కువ కూరగాయలు తినేవారిలో కూడా జుట్టు రాలడం మాత్రమే కాకుండా తరచుగా ఆందోళనకు గురవుతారని అధ్యయనం వెల్లడించింది.  

జుట్టు బలంగా ఉండేలా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే..

జుట్టు బలహీనంగా ఉంటే.. జుట్టు బలంగా పెరిగేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వారానికి రెండు సార్లు తల స్నానం చేయాలి. నిపుణుల సలహాతో పాటు, ఇంటి చిట్కాలను కూడా ప్రయత్నించండి. జుట్టు రాలడం లేదా బలహీనమైన జుట్టును బలోపేతం చేయడానికి అలోవెరా జెల్ ఉపయోగించండి. జుట్టు రాలడానికి చుండ్రు ప్రధాన కారణం కనుక నిమ్మ రసం, పెరుగుని ఉపయోగించి ఉపశనం పొందండి. సీజన్‌తో సంబంధం లేకుండా తలస్నానం చేసే ముందు నిమ్మకాయ-పెరుగు ముద్దను తలకు పట్టించండి. జుట్టు దట్టంగా పెరిగేలా .. మెరిసేలా చేయడానికి, ఎగ్ హెయిర్ మాస్క్‌ని అప్లై చేయండి. శాఖాహారులైతే బెండకాయ నీటితో  జుట్టును మెరిసేలా చేసుకోవచ్చు.


bottom of page