top of page
MediaFx

చీరకట్టులో జిమ్‌ వర్క్‌ఔట్స్‌..! నెట్టింట తీవ్ర దుమారం..


మహిళలు చీర కట్టుకుని జిమ్‌కు వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చీర కట్టుకుని జిమ్‌లో వ్యాయామం చేయడం కొంచెం కష్టమే. చీర కట్టుకుని జిమ్ పరికరాలను ఉపయోగించడం అంత సులభం కాదు. అయితే జాగ్రత్తలు తీసుకుంటే వ్యాయామం అసాధ్యం కాదు. అలాంటిది ఈ మహిళలు వ్యాయామం చేయడానికి కంటే వీడియోలు చేయడానికి చీర కట్టుకుని జిమ్‌కి వచ్చారని ఇక్కడ కొంతమంది నెటిజన్లు అంటున్నారు. జిమ్‌కి వచ్చే సమయంలో మహిళలు బ్లౌజ్‌లు ఎందుకు ఎందుకు సరిగా ధరించలేదంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి స్టంట్స్‌ అన్ని రీల్స్‌, వ్యూస్‌ కోసమే అంటున్నారు మరికొందరు నెటిజన్లు. పబ్లిసిటీ కోసమే అయినా అందులో తప్పేముంది అంటున్నారు మరికొందరు. ఇకపోతే, జిమ్‌లో ప్రతి ఒక్కరూ తమ వ్యాయామం, ఆరోగ్యం, శరీరంపై దృష్టి పెట్టాలని కొందరు అంటున్నారు. మీరు ఇతరులపై శ్రద్ధ చూపడం మానేస్తే, ప్రతిదీ చక్కగా ఉంటుంది. ఈ వీడియోపై రకరకాల రియాక్షన్‌లు వస్తూ వేగంగా వైరల్ అవుతుంది. రోజూ జిమ్‌కి వెళ్లే ఈ మహిళలు వీడియో కోసం చీర కట్టుకుని కసరత్తు చేస్తున్నారు. మహిళలు చీర కట్టుకుని జిమ్ చేస్తున్న వీడియోలు చాలా వైరల్ అవడానికి కారణం ఇదే. ఇదిలా ఉంటే, ఈ వీడియో ప్రజలలో ఉత్సుకత, చర్చనీయాంశంగా మిగిలిపోయింది. ఈ వీడియోను ఇప్పటివరకు 1.2 మిలియన్ సార్లు వీక్షించారు.



bottom of page