top of page

మహేశ్ బాబు కుర్చీమడతపెట్టి మాస్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది..🎥✨

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో మహేశ్ బాబు నటించిన చిత్రం గుంటూరు కారం . శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో వచ్చే ఊరమాస్‌ సాంగ్‌ కుర్చీమడతపెట్టి ఏ స్థాయిలో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రోమో విడుదలైనప్పటి నుంచి ఈ సాంగ్‌కు మిలియన్ల సంఖ్యలో రీల్స్‌ చేస్తూనే ఉన్నారు. విడుదలైన అన్ని ప్లాట్‌ఫాంలో వ్యూస్‌ కొల్లగొడుతోంది. తాజాగా కుర్చీ మడత పెట్టి ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్‌. సోషల్‌ మీడియాలో పాపులర్ అయిన కుర్చీతాత డైలాగ్‌తో సాగే ఈ మాస్‌ బీట్‌ సినిమాకే హైలెట్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 🎥✨


bottom of page