top of page
Suresh D

కోట్లు వస్తాయని పెళ్లిని వాయిదా వేసుకున్న క్రికెటర్..🏏

అయితే ఈ పెళ్లి వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందని తెలుస్తోంది. వాస్తవానికి వీరిద్దరి పెళ్లి గత నెలలోనే జరగాల్సి ఉంది. కానీ మిల్లర్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు.

దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ తన చిన్ననాటి గర్ల్‌ఫ్రెండ్ కామిల్లా హారిస్‌ను గత ఆదివారం వివాహమాడిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లి వెనుక ఓ ఇంటరెస్టింగ్ స్టోరీ ఉందని తెలుస్తోంది. వాస్తవానికి వీరిద్దరి పెళ్లి గత నెలలోనే జరగాల్సి ఉంది. కానీ మిల్లర్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. బీపీఎల్‌లో మూడు మ్యాచ్‌లు ఆడినందుకు గానూ.. ఏకంగా రూ. 1.25 కోట్లు చెల్లిస్తానని ఫార్చూన్ బరిషల్‌ జట్టు ఫ్రాంచైజీ ఆఫర్ ఇచ్చింది. ఆ క్యాష్ డీల్‌లో టెంప్ట్ అయ్యి.. మిల్లర్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు.ఫిబ్రవరి 26(ఎలిమినేటర్), ఫిబ్రవరి 28(క్వాలిఫైయర్ 2), మార్చి 1(ఫైనల్) తేదీల్లో మూడు మ్యాచ్‌లు ఫార్చూన్ బరిషల్‌ జట్టు తరపున ఆడాడు డేవిడ్ మిల్లర్. ఇక బీపీఎల్ 2024 విజేతగా ఫార్చూన్ బరిషల్‌ జట్టు నిలవడం విశేషం. ఈ క్రమంలోనే డేవిడ్ మిల్లర్ విషయాన్ని తాజాగా పాకిస్తాన్ మాజీ బౌలర్ వసీం అక్రమ్ తెలిపాడు.🏏

bottom of page