ప్రస్తుతం ఆర్టీసీ బస్సు ప్రయాణికుల్లో దాదాపు 40 శాతం మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.
వీరికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ఆర్టీసీ సంస్థకు రావాల్సిన ఆదాయం సుమారుగా రూ.4 కోట్ల వరకు తగ్గుతుందని అంచానా. ఇక సిటీ సర్వీస్ ల ద్వారా రోజుకి మరో 50 లక్షలు తగ్గిపోయే వచ్చే అవకాశం ఉందని సమచారం..ఈ విషయాలనే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీఎం రేవంత్ కు వివరించినట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా.. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్న.. టిఎస్‌ఆర్‌టిసి పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు రెండింటిలోనూ అమలు చేస్తే అంచనా వ్యయం సంవత్సరానికి రూ. 2,200 కోట్లు అవుతుందని సీనియర్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం కేవలం పల్లె వెలుగు పరిధిలోని ఆర్టీసీ బస్సులకే పరిమితమైతే ఏడాదికి రూ.750 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా ఉచిత బస్సు ప్రయాణ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. 🚌🚺✨