top of page
Shiva YT

  📅 ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చేనా..? కోటి ఆశలతో నిరుద్యోగుల ఎదురు చూపులు..📢

📍 హైదరాబాద్, జనవరి 31: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక.. కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు అయింది.

ఇప్పుడు టీఎస్పీయస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి నేతృత్వంలోని టీమ్ నియామక ప్రక్రియపై ఎప్పుడు తీపి కబురుచెబుతుందా? అని లక్షలాది నిరుద్యోగులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో వచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు జరిపినవి రద్దు కాగా మరికొన్ని పరీక్షలను అసలు నిర్వహించనేలేదు. మరి వీటన్నింటిని కొత్త కమిషన్ ఏం చేయబోతుంది? అనేది ఆసక్తిగా మారింది. TSPSC చైర్మన్ మహేందర్ రెడ్డి సహా మరో ఐదుగురు సభ్యులను నియమిస్తూ ఇటీవల గవర్నర్ ఆమోదంతో సర్కారు కొత్త సర్వీస్ కమిషన్ బోర్డును ఏర్పాటు చేసింది.

🤔 గత ప్రభుత్వం 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ ను జారీ చేయగా పేపర్ లీకేజీతో ఒకసారి, బయోమెట్రిక్ ఇష్యూతో రెండోసారి రాసిన ప్రిలిమినరీ పరీక్ష రద్దు అయింది. దీనిమీద కొత్త కమిషన్ మరికొన్ని పోస్టులు యాడ్ చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 780 పోస్టులకు గ్రూప్ -2 నియామక పరీక్ష ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. దీనికి కూడా కొత్తగా మరికొన్ని పోస్టులను జతచేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. గ్రూప్ -3 నోటిపికేషన్‌లో 1380 పోస్టులు ఇచ్చినా ఎగ్జామ్ నిర్వహించలేదు. దీన్ని కూడా రీషెడ్యూల్‌ చేసే ఛాన్స్ ఉంది. 8,039 పోస్టులతో గ్రూప్-4 పరీక్ష నిర్వహించి ఫైనల్ కీ కూడా రిలీజ్ చేశారు. ఫలితాల కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. 📚👩‍🎓

bottom of page