🍏🏋️♀️ ప్రస్తుత జీవనశైలి కారణంగా చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. కాబట్టి అందరూ ఆరోగ్యంపై దృష్టిసారించాలి. ప్రస్తుతం ఆరోగ్యం కోసం చాలామంది గ్రీన్ టీ తాగుతున్నారు. 🍵🏃♀️ దీని రుచి కొంతమందికి నచ్చకపోయినా ప్రయోజనాల కోసం తాగడం మొదలుపెడుతున్నారు. కాగా ఈ టీ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లను మేరుపరుస్తుంది.
🍽️🍀 ఇది మాత్రమే కాదు జీవక్రియను పెంచి అధిక బరువును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 🍵🩺 గ్రీన్ టీ తాగితే టైప్-2 డయాబెటిస్ సమస్య దూరమవుతుంది. అయితే కొంతమంది భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగుతున్నారు. 🍵🍽️ గ్రీన్ టీ ఇలా తాగితే ప్రయోజనలు ఉంటుందా లేదా తెలుసుకుందాం.🍛🏃♂️ ఆహారం తీసుకున్న తర్వాత గ్రీన్ టీ తాగితే బరువు తగ్గుతారని లేదా జీర్ణక్రియకు ఉపయోగపడుతుందని అనుకుంటే పొరపాటే. ఆహారం తీసుకున్న వెంటనే ఏ టీ తగిన సరే హాని చేస్తుంది.🚫🍵⏰ దీని కారణంగా ఆరోగ్యకార పోషకాలను గ్రహించడం కష్టతరం మారుతుంది. పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉన్న గ్రీన్ టీ జీర్ణక్రియకు ఉపయోగపడినప్పటికి భోజనం చేసిన వెంటనే దీన్ని తీసుకోకూడదు. దీనిలో ఉన్న టానిన్లు కారణంగా కడుపులో యాసిడ్ పెరిగి కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు వస్తాయి.🍽️🍵 తిన్న వెంటనే గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ఏదైనా తిన్న 2 గంటల ముందుగాని తర్వాత గాని గ్రీన్ టీ తాగితే మంచి ప్రయోజనలు లభిస్తాయని నిపుణులు చెపుతున్నారు.🙅♂️🍵🕒 కొంతమందికి ఉదయాన్నే ఏమి తినకుండా ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం అలవాటు. అయితే ఈ పద్దతి శరీరానికి హాని కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో దీన్ని తీసుకుంటే వికారం పుడుతుంది. దీనిలో ఉన్న టానిన్లు కారణంగా కడుపులో యాసిడ్ పెరిగి కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు వస్తాయి.