top of page
MediaFx

చంద్రబాబును నమ్మి ఓటెస్తే గోవిందా.. గోవిందా..!


మేమంతా సిద్ధం సక్సెస్‌ జోష్‌తో ఉన్న వైసీపీ అధినేత, సీఎం జగన్‌.. ప్రచారంలో మరింత దూకుడు పెంచారు.మేనిఫెస్టో విడుదల తరువాత తనదైన స్టయిల్‌లో జనంలోకి దూసుకుపోతున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో మెరుపు ప్రచారాలు నిర్వహిస్తూ.. పార్టీ అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఓ వైపు చంద్రబాబు పాలనలో వైఫల్యాలను వివరిస్తూ..మరోవైపు 58 నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తున్నారు. జగన్‌ ప్రచారానికి ప్రజలు, పార్టీ శ్రేణుల నుండి కూడా అంతే స్పందన లభిస్తోంది. సోమవారం అనకాపల్లి జిల్లా చోడవరంలో జగన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. చోడవరంలోని కొత్తూరు జంక్షన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ.. జగన్‌కు ఓటు వేస్తే అన్ని పథకాలు కొనసాగుతాయని.. చంద్రబాబుకు ఓటు వేస్తే.. అన్ని పథకాలు ఆగిపోతాయన్నారు. గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం చేసిందన్నారు. మీ భవిష్యత్ ను నిర్ణయించే ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు దొంగ హామీలతో మోసం చేశారంటూ విమర్శించారు. చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు గోవిందా.. గోవిందా అంటూ ఎద్దెవా చేశారు. అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది అన్నారు.

రోజుకు 3 సెగ్మెంట్లలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలోని కొత్తూరు జంక్షన్‌లో సభ తర్వాత.. సీఎం జగన్ పి.గన్నవరం వెళ్లనున్నారు. అమలాపురం పార్లమెంట్‌ పరిధిలో రోడ్‌షో నిర్వహిస్తారు. అంబాజీపేట బస్టాండ్‌ సెంటర్‌లో సీఎం జగన్ సభ జరగనుంది. సాయంత్రం గుంటూరు పార్లమెంట్‌ పరిధిలో సభలో ప్రసంగిస్తారు. పొన్నూరు ఐలాండ్ సెంటర్‌లో సీఎం జగన్ బహిరంగ సభ జరగనుంది.



bottom of page