top of page

పెళ్లి కాని వారికి..కొత్త స్కీమ్ ప్రకటించిన ప్రభుత్వం..

సాధారణంగా వృద్ధులు,వితంతువులకు ప్రభుత్వాలు నెలనెలా పెన్షన్(Monthly pension) అందిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే అవివాహితులకు(Unmarried people) కూడా నెల నెలా పెన్షన్ అందించాలని హర్యానా ప్రభుత్వం(Haryana govt) కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం గురువారం ఓ ప్రకటన చేశారు. హర్యానా రాష్ట్రంలో 45-60 ఏళ్ల మధ్య వయసున్న పెళ్లికాని వారి వార్షికాదాయం రూ.1.8 లక్షల లోపు ఉంటే వారికి రూ.2,750 నెలవారీ పెన్షన్ అందజేస్తామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ విలేకరుల సమావేశంలో గురువారం ప్రకటించారు. రూ. 3 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న ఒకే వయస్సు గల వితంతువులు(మగ,ఆడ ఇద్దరికీ) కూడా పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది.

దారిద్య్ర రేఖకు దిగువన (BPL) ఉన్న 45-60 సంవత్సరాల మధ్య వయస్సు గల దాదాపు 65,000 మంది అవివాహిత పురుషులు మరియు స్త్రీలకు పరివార్ పెహచాన్ పత్ర (PPP) పథకం కింద పెన్షన్ అందించబడుతుందని సీఎం తెలిపారు. అంతకుముందు, జూన్ 26న హర్యానా పోలీసు సిబ్బందికి ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకు నెలవారీ మొబైల్ అలవెన్స్‌ను(Mobile allowance)ప్రవేశపెడుతున్నట్లు సీఎం ఖట్టర్ ప్రకటించారు. కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు నెలకి రూ.200, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లకు రూ.250, సబ్ ఇన్‌స్పెక్టర్లకు రూ.300, ఇన్‌స్పెక్టర్లకు రూ.400 చొప్పున మొబైల్ అలవెన్స్‌ను హర్యానా సీఎం ఖట్టర్ ప్రకటించారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page