top of page

అనుకోని వివాదంలో గోపిచంద్‌ రామబాణం..

రామబాణం సినిమాలో ఐఫోన్ పిల్ల.. అంటూ సాగే ఓ పాట ఉంది. ఈ పాట ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో నా ప్రాణం ఆగదే పిల్ల..అనే లైన్ ఉంది. తాజాగా కరీంనగర్‌కు చెందిన గొల్లపల్లి రవీందర్ అనే ఫోక్‌ సింగర్‌ ఈ పాట తనదే, ట్యూన్ కూడా తనదేనంటూ మీడియాను ఆశ్రయించారు.


మ్యాచోస్టార్‌ గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటించిన తాజా చిత్రం రామబాణం. లక్ష్యం, లౌక్యం చిత్రాలతో ఆకట్టుకున్న డైరెక్టర్‌ శ్రీవాస్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జగపతి బాబు, ఖుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమా మే 5న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ నిర్మించింది. ఇప్పటికే సినిమా నుంచి ట్రైలర్, సాంగ్స్ రిలీజై ప్రేక్షకులని అలరిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా గోపీచంద్ సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. రామబాణం సినిమాలో ఐఫోన్ పిల్ల.. అంటూ సాగే ఓ పాట ఉంది. ఈ పాట ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో నా ప్రాణం ఆగదే పిల్ల..అనే లైన్ ఉంది. తాజాగా కరీంనగర్‌కు చెందిన గొల్లపల్లి రవీందర్ అనే ఫోక్‌ సింగర్‌ ఈ పాట తనదే, ట్యూన్ కూడా తనదేనంటూ మీడియాను ఆశ్రయించారు.

ఈ పాటను 1992లో చేతికి గాజులు పిల్లో పాట రాశానని చెబుతున్నారు. అప్పట్లోనే ఆ పాటా బాగా హిట్‌ అయ్యిందని తెలిపారు. ఆ పాటలోని లైన్ ని, తన ట్యూన్‌ని రామబాణం యూనిట్ వాళ్ళు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాడుకున్నారని ఆరోపించారు. సినిమా రిలీజ్‌ అయ్యేలోపు మ్యూజిక్‌ డైరెక్టర్‌ లేదా , చిత్ర యూనిట్‌ కానీ దీనిపై వివరణ ఇవ్వకపోతే తానూ లీగల్‌గా వెళ్తానన్నారు. అప్పటికప్పుడు.. క్యాసెట్‌ తెప్పించి మరీ, టీవీ9 టీమ్‌ ఎదుట వినిపించారాయన.రామబాణం సినిమాలో తన పాటను మక్కీకి మక్కీ ట్యూన్‌ను కాపీ కొట్టారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు గొల్లపల్లి రవీందర్‌. చేతికి గాజులు పెట్టి..ఇప్పుడు సినిమాలో ఉన్న ఐఫోన్ చేతిలోపట్టి.. ట్యూన్ సేమ్‌ ఉందని, తన పాటలోని కొన్ని పదాలు వాడారని ఆయన అంటున్నారు. అయితే రవీందర్ రాసిన పాటలోని ఒక్క లైన్ మాత్రమే సినిమా పాటలో ఉంది. ట్యూన్ కూడా కొన్నిచోట్ల మాత్రమే ఒకేలా ఉంది. మరి దీనిపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

రిలీజ్ ముందే రామబాణం కి అడ్డంకులు ఈసారైనా హిట్ కొడుతోందా..

  • YES

  • NO




Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page