top of page

దూకుడు చూపించిన గోపీచంద్ దూసుకొచ్చిన ‘రామబాణం’ ట్రైలర్..

హీరో గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించిన ‘రామబాణం’ మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహించగా.. తాజాగా ట్రైలర్‌తో అచ్చం ‘రామబాణం’ మాదిరిగా దూసుకొచ్చాడు గోపీచంద్.

‘ఈ క్షణం.. ఈ ప్రయాణం.. నేను ఊహించిందికాదు, నేను ప్లాన్ చేసింది కాదు’ అంటూ గోపీచంద్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. భైరవి పాత్రలో డింపుల్ హయాతిని యూట్యూబర్‌గా చూపించారు. వెన్నెల కిశోర్ ‘సావిత్రి’ క్యారెక్టర్ హిలేరియస్‌గా ఉంది. ఇక పెద్దాయన పాత్రలో హుందాగా కనిపించిన జగపతి బాబు.. ‘స్వచ్ఛమైన ఆహారం, మంచి బంధాలు, ఇవి రెండే మనిషిని కాపాడతాయి’ అని చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. అలాగే అన్నం తినండి, కెమికల్స్ కాదని ఆయన చెప్పడం చూస్తుంటే.. సినిమాలో ఈ టాపిక్‌కు ప్రిఫరెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.డైరెక్టర్ శ్రీవాస్, గోపీచంద్‌.. తమది హిట్ కాంబినేషన్‌ అని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో ఖుష్బు, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించగా.. ట్రైలర్‌లో వచ్చిన మాస్ సాంగ్ ఆకట్టుకుంది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page