తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సీఎం నివాసంలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ గ్రూప్ వైఎస్ చైర్మన్ తమ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో అధికార బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. పాలనలో దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులే లక్ష్యంగా వివిధ కంపెనీలకు చెందిన ప్రముఖులతో సమావేశమవుతున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సీఎం నివాసంలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ గ్రూప్ వైఎస్ చైర్మన్ తమ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం సీఎం నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట సీఎంతో చర్చించి ప్రభుత్వంతో కలిసి పనిచేయండనికి సంసిద్ధతను వ్యక్తం చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందని, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో తెలంగాణ కోసం డిజిటలైజేషన్ ఎజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు అవుతామన్నారు. అలాగే తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడానికి నాణ్యమైన సేవలను అందించడానికి లోతైన సాంకేతికత, నైపుణ్యం తమతో ఉందని చంద్రశేఖర్ ముఖ్యమంత్రికి వివరించారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రత మెరుగుదలలపై కూడా ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు డి.శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.