ఇకపై గూగుల్ మ్యాజిక్ ఎడిటర్ యాప్‌ని అందరూ వాడొచ్చు. ఆండ్రాయిడ్, IOS యూజర్లందరికీ గూగుల్ ఈ సర్వీసులను ఉచితంగా అందించనుంది. ప్రారంభంలో కేవలం Pexel 8, Pexel 8Pro సిరీస్‌లో విడుదల చేసింది. అయితే ఇప్పుడు గూగుల్ ఫోటోలను వాడే యూజర్లందరికీ ఉచితంగా అందించనుంది. ఇది Google నుంచి అత్యంత శక్తివంతమైన AI పవర్డ్ ఫోటో ఎడిటింగ్ యాప్. ఇంతకీ ఈ యాప్‌లో ఏముంటాయి.. ఇందులోని ఫీచర్ల ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి.. అసలు ఈ మ్యాజిక్ ఎడిటర్ అంటే ఏంటనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...
మ్యాజిక్ ఎడిటర్ అంటే?
Magic Editor అనేది శక్తివంతమైన Google Pixel AIకి సంబంధించిన ఎడిటింగ్ యాప్. ఇది మే 15వ తేదీ ప్రారంభించబడింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI)ని ఉపయోగించి, మ్యాజిక్ ఎడిటర్ యూజర్లు తీసిన ఫోటోలను మరింత స్పష్టంగా చూపగలదు. మీరు గూగుల్ ఫోటోల యూజర్ అయితే దీనికి సులభంగానే యాక్సెస్ పొందొచ్చు. గూగుల్ మ్యాజిక్ ఎడిటర్ ప్రయోజనం ఏంటంటే.. ఇది క్లిష్టమైన ఫోటోల నుంచి కదిలే వస్తువులను కూడా సులభంగా తొలగించగలదు. అంతేకాదు ఫోటో నేపథ్యాన్ని కూడా మార్చగలదు.